Coronavirus: ద‌క్షిణాది రాష్ట్రాల ఆరోగ్య మంత్రుల‌తో కేంద్రం కోవిడ్‌-19 స‌మీక్షా

By Mahesh Rajamoni  |  First Published Jan 28, 2022, 1:01 PM IST

Coronavirus: దేశంలో క‌రోన మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాతున్న‌ది. మ‌రీ ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాల్లో కొత్త కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా  శుక్ర‌వారం కోవిడ్ పరిస్థితిపై దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌తో కోవిడ్‌-19పై స‌మీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఏపీ, కర్నాట‌క‌, కేరళ, తెలంగాణ, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల ఆరోగ్య శాఖ మంత్రులు హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి.
 


Coronavirus: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. ద‌క్షిణాఫ్రికాలో గ‌త న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా (Coronavirus) మ‌హ‌మ్మారి ప్ర‌భావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. భార‌త్ లోనూ క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. కోవిడ్‌-19 థ‌ర్డ్ వేవ్ అంచ‌నాలు తీవ్ర భయాందోళ‌న క‌లిగిస్తున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి (Coronavirus)  సాధార‌ణ కేసుల‌తో పాటు ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు మొత్తం దేశంలో నాలుగు కోట్ల మార్కును అందుకున్నాయి. రోజువారీ (Coronavirus) మరణాలు సైతం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ద‌క్షిణాది రాష్ట్రాల్లో క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతున్న నేప‌థ్యంలో శుక్ర‌వారం నాడు కేంద్ర ప్ర‌భుత్వం ఆయా రాష్ట్రాల‌తో క‌రోనా ప‌రిస్థితుల‌పై స‌మీక్షా స‌మావేశం నిర్వహించ‌నుంది. 

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా  శుక్ర‌వారం కోవిడ్ పరిస్థితిపై దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌తో కోవిడ్‌-19పై స‌మీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఏపీ, కర్నాట‌క‌, కేరళ, తెలంగాణ, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల ఆరోగ్య శాఖ మంత్రులు హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి. క‌రోనా వైర‌స్ థ‌ర్డ్ వేవ్ ఉప్పెన నేప‌థ్యంలో కోవిడ్‌-19 పరిస్థితి, ప్రజారోగ్య సంసిద్ధతతో పాటు ప్ర‌స్తుతం తీసుకుంటున్న చర్యలను సమీక్షించేందుకు శుక్ర‌వారం మధ్యాహ్నం 2.30 గంటలకు దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవియా ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశానికి సీనియర్‌ ఆరోగ్యశాఖ అధికారులు కూడా హాజరుకానున్నారు.

Latest Videos

undefined

ఇదిలావుండ‌గా, దేశంలో గత కొన్ని రోజులుగా నిత్యం రెండు లక్షలకు పైగానే (Coronavirus)  పాజిటివ్‌ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అయితే, కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల్లో స్వ‌ల్పంగా త‌గ్గుద‌ల న‌మోదైంది.  గురువారం 2.8 లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, కొత్తగా 2.51 లక్షలకు (Coronavirus) తగ్గాయి. దీంతో పాజిటివిటీ రేటు కూడా తగ్గింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 2,51,209 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్‌-19 కేసులు 4,06,22,709కి చేరాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,80,24,771 మంది బాధితులు కరోనా వైరస్(Coronavirus) నుంచి కోలుకున్నారు.  గ‌త 24 గంట‌ల్లోనే 3 ల‌క్ష‌ల మందికి పైగా కోలుకోవ‌డం ఊర‌ట క‌లిగించే విష‌యం. కొత్త‌గా  3,47,443 మంది కోవిడ్‌-19 నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు అధికం అవుతూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం  21,05,611 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి.

క‌రోనా (Coronavirus) మ‌ర‌ణాలు మాత్రం త‌గ్గ‌డం లేదు. గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ (Coronavirus) తో పోరాడుతూ కొత్తగా 627 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో ఇప్పటివ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య  4,92,327కు పెరిగింది. కరోనా కేసులు తక్కువవడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 15.28 శాతానికి తగ్గింది. 

click me!