Goa Assembly election 2022: బీజేపీపైనే నా పోరాటం.. ఉత్ప‌ల్ పారిక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By Mahesh RajamoniFirst Published Jan 28, 2022, 12:15 PM IST
Highlights

Goa Assembly election 2022: గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అక్క‌డి రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఇటీవ‌లే బీజేపీకి గుడ్ బై చెప్పిన గోవా మాజీ సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్  కుమారుడు ఉత్ప‌ల్ పారిక‌ర్.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న పోరాటం కేవ‌లం బీజేపీ పైన మాత్ర‌మేన‌నీ, ఇత‌ర పార్టీల పైన కాద‌నీ అన్నారు. ఎన్నికల్లో గెలిచినా మళ్లీ బీజేపీలో చేరేది లేదని స్పష్టం చేశారు. 
 

 Goa Assembly election 2022: వ‌చ్చే నెల‌లో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు హీటు పెంచాయి. ఈ ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా  గోవాలో లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అన్ని ప్ర‌ధాన పార్టీలు రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్రచారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతో విరుచుకుప‌డుతుండ‌టంతో రాష్ట్ర రాజ‌కీయాలు కాక రేపుతున్నాయి. అయితే, అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్న బీజేపీకి.. కీల‌క నేత‌లు క‌మ‌లాన్ని వీడుతుండ‌టం క‌ల‌వ‌రానికి గురిచేస్తున్న‌ది. ఇటీవ‌లే బీజేపీకి గుడ్ బై చెప్పిన గోవా మాజీ సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్ (Manohar Parrikar) కుమారుడు ఉత్ప‌ల్ పారిక‌ర్ (Utpal Parrikar).. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న పోరాటం కేవ‌లం బీజేపీ పైన మాత్ర‌మేన‌నీ, ఇత‌ర పార్టీల పైన కాద‌నీ అన్నారు. 

ఉత్పల్ పారిక‌ర్ (Utpal Parrikar) కు పనాజీ టికెట్‌ను కేటాయించపోవడంతో ఆయన బీజేపీ (BJP) ని గతవారం  గుడ్‌బై చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీజేపీని టార్గెట్ చేస్తూ.. తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఉత్పల్ పారికర్ తన తండ్రి (Manohar Parrikar) నియోజకవర్గమైన పనాజీ నుంచి గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగానే తాను  పనాజీ నుంచి ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్నాన‌ని తెలిపారు. గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా  నామినేషన్ దాఖ‌లు చేసిన అనంతరం ఉత్ప‌ల్ పారిక‌ర్ మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఎన్నికల్లో తన పోరాటం  కేవ‌లం భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) పైనా మాత్ర‌మేన‌ని అన్నారు. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన ఆమ్ ఆద్మీ (ఆప్‌), తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ), కాంగ్రెస్ పార్టీల‌పైన కాద‌నీ ఉత్ప‌ల్ పారిక‌ర్ స్పష్టం చేశారు. బీజేపీ త‌న‌కు పనాజీ నుండి పోటీ చేసేందుకు ఎప్పుడూ టిక్కెట్ ఇవ్వలేదనీ, ఈ ఎన్నిక‌ల్లో (Goa Assembly election 2022) గెలిచిన తిరిగి తాను బీజేపీలోకి చేర‌న‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

"బిజెపి నాకు రెండు, మూడు సీట్లు ఇచ్చిందని ప్రమోద్ సావంత్ (గోవా సీఎం) చెబుతున్నారు. అయితే నిజం ఏమిటంటే ఆ పార్టీ నాకు పనాజీ నుండి పోటీ చేసేందుకు ఎప్పుడూ టిక్కెట్ ఇవ్వలేదు. నేను ఎన్నికల్లో (Goa Assembly election 2022)గెలిచినా తిరిగి బిజెపిలో చేరను" పనాజీలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి ముందు మహాలక్ష్మి ఆలయంలో ప్రార్థనలు చేసిన  అనంతరం ఉత్ప‌ల్ పారిక‌ర్ ఈ వ్యాఖ్యాలు చేశారు. కాగా, ఆయ‌న బీజేపీని వీడిన త‌ర్వాత చాలా పార్టీల నాయ‌కులు త‌మ పార్టీలో చేరాల‌ని ఉత్ప‌ల్ పారిక‌ర్ ను ఆహ్వానించాయి.  ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), TMC, శివసేన వంటి ప్రతిపక్ష పార్టీలు తమ ఎన్నికల గుర్తుపై ఎన్నికలలో పోటీ చేయమని ఉత్పల్‌ (Utpal Parrikar)ను ఆహ్వానించాయి. అయితే ఆయ‌న ఈ  ప్రతిపాదనల‌ను తిరస్కరించారు. 

కాగా, మనోహర్ పారికర్ (Manohar Parrikar) 1994 నుండి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ పనాజీ నియోజ‌క వ‌ర్గం నుంచి గెలుపొందారు. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫిబ్రవరి 2015లో ఆయన రాజీనామా చేశారు. 2017లో బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహించేందుకు ఆయనను గోవాకు వ‌చ్చారు. ఆ తర్వాత పనాజీ నుంచి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కూడా సేవ‌లు అందించారు. కాగా, 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుండగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

click me!