ఎమ్మెల్యేగా మారిన క్రికెటర్.. షిబ్‌పూర్ లో సిక్సర్ కొట్టిన మనోజ్ తివారి !

By AN TeluguFirst Published May 3, 2021, 9:55 AM IST
Highlights

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్ ఫలితాలు తీవ్ర ఉత్కంఠ మధ్య ముగిశాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో టీమిండియా ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ బంపర్ మెజార్టీతో గెలుపొందాడు

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్ ఫలితాలు తీవ్ర ఉత్కంఠ మధ్య ముగిశాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో టీమిండియా ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ బంపర్ మెజార్టీతో గెలుపొందాడు.

గతంలో టీమ్ ఇండియా తరఫున ఆడిన క్రికెటర్ మనోజ్ తివారీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్ లో చేరాడు. ఆయనకు బెంగాల్ లోని షిబ్‌పూర్ అసెంబ్లీ టిక్కెట్ను టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేటాయించారు.

అప్పటినుంచి గెలుపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం చేసిన మనోజ్ తివారీ ఎన్నికల వేళ బాగా కష్టపడ్డాడు. నిన్న వెలువడిన ఫలితాల్లో తన సమీప బిజెపి అభ్యర్థి చక్రవర్తిపై 6 వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందాడు.

జనరల్ కేటగిరీకి చెందిన ఈ నియోజకవర్గంలో 2016లో ఏఐఎఫ్‌బీకి చెందిన అభ్యర్థి విజయం సాధించాడు. అంతకుముందు టీఎంసీ కి చెందిన  జతు లాహిరి గెలుపొందాడు. కానీ ఈ సారి మమతా బెనర్జీ సిట్టింగ్ కి కాకుండా అనూహ్యంగా ఈ సీటును క్రికెటర్ అయిన మనోజ్ తివారీ కేటాయించింది.

సీటు అయితే కేటాయించింది కానీ మమతా బెనర్జీ ఈ నియోజకవర్గంపై దృష్టి సారించలేదు. అయినా సరే తివారీ సొంతంగా ఇక్కడ ప్రచారం చేసి గెలుపొందాడు. 

1985 నవంబర్ 14న హౌరా లో జన్మించిన మనోజ్ తివారీ చిన్నప్పటినుంచే క్రికెట్ మీద దృష్టిపెట్టాడు కుడిచేతి వాటం బ్యాట్స్మన్ గా కెరీర్ ప్రారంభించాడు. పశ్చిమబెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన మనోజ్ జాతీయ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. 

మనోజ్ తివారీ టీమిండియా తరఫున 2008లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేశాడు. 2012 t20 world cup జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. తన కెరీర్ లో 12 వన్డేలు, రెండు అంతర్జాతీయ టి20లు కూడా ఆడాడు. వన్డేల్లో ఒక సెంచరీ, మరో అర్థ సెంచరీ చేసిన మనోజ్ టీ20ల్లో మాత్రం విఫలమయ్యాడు.

ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడాడు. 2018 ఐపీఎల్ సీజన్ అతడికి చివరిది. కాగా పంజాబ్ జట్టు అతడిని 2018 లో కోటి రూపాయలకు కొనుక్కున్నది.

2018 -19 సీజన్ విజయ్ హజారే ట్రోఫీ లో బెంగాల్ తరఫున అత్యధిక స్కోరు రికార్డు మనోజ్ తివారీ పేరిటే ఉన్నది. మనోజ్ తివారీ 119 ఫస్ట్ క్లాస్, 163 లిస్ట్ ఏ మ్యాచులు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మనోజ్ తివారి ఒక ట్రిపుల్ సెంచరీ కూడా చేశాడు. చివరిసారిగా 2012 సెప్టెంబర్ 11న న్యూజిలాండ్ టి10 మ్యాచ్ ఆడాడు. కాగా తివారీ ఇంతవరకు తన క్రికెట్ కెరీర్ కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించలేదు. 

click me!