కమల్ హాసన్ ని ఓడించిన మహిళా నేత ఎవరో తెలుసా..?

Published : May 03, 2021, 08:56 AM ISTUpdated : May 03, 2021, 09:52 AM IST
కమల్ హాసన్ ని ఓడించిన మహిళా నేత ఎవరో తెలుసా..?

సారాంశం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీకి దిగారు. అయితే... ఈ ఎన్నికల్లో తొలుత ముందంజలో కనపడిన కమల్ హాసన్.. అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఆయన ఓటమిని ఎవరూ ఊహించలేదు.

సినీ రంగంలో విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కమల్ హాసన్.  ఆయన ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో అడుగుపెట్టారు. మక్కల్ నీది మయ్యం అనే పార్టీ పెట్టి ఆయన తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీకి దిగారు. అయితే... ఈ ఎన్నికల్లో తొలుత ముందంజలో కనపడిన కమల్ హాసన్.. అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఆయన ఓటమిని ఎవరూ ఊహించలేదు.

బీజేపీ అభ్యర్థి, మహిళా నేత వనతి శ్రీనివాసన్ చేతిలో కమల్ హాసన్ ఓటమిపాలవ్వడం గమనార్హం. 1,540 ఓట్ల స్వల్ప మెజార్టీతో కమల్ పై వనతి నెగ్గారు. వనతికి 52,627 ఓట్లు రాగా.. కమల్ కు 51,087 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి మయూర ఎస్ జయకుమార్ కు 41,663 ఓట్లు పడ్డాయి.

కాగా కమల్‌మాసన్‌ పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి మూడో కూటమిగా ఏర్పడింది. మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్‌ హాసన్‌ ప్రకటించుకున్నారు. అయితే చివరకు ఆయన ఓడిపోవడం షాకింగ్‌కు గురి చేసే అంశం. ఆయనతో పాటు ఆయన పార్టీకి చెందిన వారు 142 స్థానాల్లో పోటీ చేయగా వారందరూ పరాజయం పొందారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారం సొంతం చేసుకుంటోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ కన్నా అధిక స్థానాలు డీఎంకే సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌ ముఖ్యమంత్రి కానున్నారు.

ఇదిలా ఉండగా.. ఎగ్జిట్ పోల్ లో సైతం తమిళనాడులో స్టాలిన్ దే విజయం అని అన్ని పార్టీలు చెప్పాయి. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చింది. ప్రస్తుత పళనిస్వామి ప్రభుత్వానికి ఓటమి ఖాయమని బల్ల గుద్ది ప్రకటించింది. ఉన్న మొత్తం సీట్లలో డీఎంకే కూటమి 10-20 సీట్లను సాధించి అధికారం హస్తగతం చేసుకుంటుందని సర్వే పేర్కొంది. 
మరో మూడు రాష్ట్రాలు, మరొక కేంద్రపాలీత ప్రాంతాలతో కలిపి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే దఫాలో ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అనేక పార్టీలు బరిలో ఉన్నప్పటికీ... ప్రధానంగా పోరు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యనే సాగింది.  
డీఎంకే, కాంగ్రెస్ తో జతకట్టి బరిలో దిగగా, అన్నా డీఎంకే బీజేపీతో జతకట్టి బరిలోకి దిగింది. డీఎంకే, అన్నాడీఎంకేల అధినేతలు కరుణానిధి, జయలలితలు లేకుండా ఆ పార్టీలు ఎదుర్కుంటున్న తొలి ఎన్నికలు ఇవే..!కమలహాసన్, టీటీవి దినకరన్ కి చెందిన పార్టీలు కూడా బరిలో ఉన్నప్పటికీ... వారి ప్రభావం నామమాత్రంగానే ఉంది. 
2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తమిళనాడు అంతటా గెలుపుబావుటా ఎగురవేసింది. ఎన్నికలకు ముందు ప్రకటించిన ఒపీనియన్ పోల్స్ లో కూడా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 155 నుండి 177 సీట్ల వరకు సాధించి దక్కించుకుంటుందని పేర్కొనగా, అధికార అన్నాడీఎంకే మాత్రం 22 నుండి 83 సీట్ల వరకు సాధిస్తుందని పేర్కొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించాయి.

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Viral News: పెరుగుతోన్న విడాకులు.. ఇకపై పెళ్లిళ్లు చేయకూడదని పండితుల నిర్ణయం