Mann Ki Baat : ప్ర‌జాస్వామ్య మార్గాల ద్వారా భార‌తీయులు ఎమ‌ర్జెన్సీని ఓడించారు - ప్ర‌ధాని నరేంద్ర మోడీ

By team teluguFirst Published Jun 26, 2022, 3:07 PM IST
Highlights

ప్రజాస్వామ్య మార్గాల ద్వారా భారతీయులు ఎమర్జెన్సీని ఓడించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తన నెలవారీ మాన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన దేశం మొత్తం.. ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న ప్రస్తుతం తరుణంలో 75 ఏళ్ల స్వతంత్ర ప్రయాణాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీ తన నెలవారీ రేడియో కార్యక్రమం మాన్ కీ బాత్ లో ఆదివారం ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎమ‌ర్జెన్సీ రోజుల‌ను గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి భార‌తీయులు ప్రజాస్వామ్య మార్గాల ద్వారా పోరాడి ఎమర్జెన్సీని ఓడించార‌ని అన్నారు. ‘‘ శతాబ్దాలుగా మనలో పాతుకుపోయిన ప్రజాస్వామ్య విలువలు, మన సిరల్లో ప్రవహించే ప్రజాస్వామ్య స్ఫూర్తి చివరకు ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా మాత్రమే విజయం సాధించింది. భారతదేశంలోని ప్రజలు ఎమర్జెన్సీని తొలగించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు ’’ అని ఆయన ప్రసంగించారు. 

మాన్ కీ బాత్ లో ప్రధాని మాట్లాడిన ముఖ్యాంఖాలు.. 
మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ.. ‘‘ నాకు గుర్తుంది..ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశంసించడానికి నిరాకరించినప్పుడు ఆయ‌న నిషేధానికి గుర‌య్యాడు. ఆయ‌న‌ను రేడియోలో ప్రసంగానికి అనుమతించలేదు. దేశంలో అనేక ప్రయత్నాలు, వేల సంఖ్యలో అరెస్టులు, లక్షలాది మందిపై దౌర్జన్యాలు జరిగినప్పటికీ ప్రజాస్వామ్యంపై భారతీయుల విశ్వాసం వమ్ము కాలేదు. నేడు దేశం మొత్తం 75 ఏళ్ల స్వాతంత్ర వేడుక‌లు జ‌రుపుకుంటున్న స‌మ‌యంలో మనం ఎమర్జెన్సీ చీకటి కాలాన్ని మరచిపోకూడదు. అమృత్ మహోత్సవం మనకు విదేశీ పాలన నుండి స్వాతంత్రం గురించి మాత్రమే కాకుండా 75 సంవత్సరాల స్వాతంత్ర ప్రయాణాన్ని కూడా చెబుతుంది.’’ అని ప్రధాని మోడీ అన్నారు.

Sharing this month's . Tune in. https://t.co/4vGCN8ZiW2

— Narendra Modi (@narendramodi)

‘‘ కోవిడ్-19కి విషయంలో మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ నేడు దేశంలో వ్యాక్సిన్ స‌మ‌గ్ర రక్షణ కవచం ఉంది. ఇది సంతృప్తికరమైన విషయం. మ‌నం దాదాపు 200 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లకు చేరుకున్నాము. అలాగే దేశంలో ముందు జాగ్ర‌త్త డోసును కూడా వేగంగా అందిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల విష‌యంలో ఎవరూ ఆలోచించలేదు. నేడు వారి సంఖ్య వందకు పైగా ఉంది. చెన్నై, హైదరాబాద్‌లోని రెండు స్టార్టప్‌లు, అగ్నికుల్, స్కైరూట్ చిన్న పేలోడ్‌లను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి. ’’ అని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. 
 

click me!