లిక్కర్ స్కామ్ కేసు.. బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా.. రేపు విచారణకు వచ్చే అవకాశం

By Asianet News  |  First Published Mar 3, 2023, 5:11 PM IST

సీబీఐ రిమాండ్ లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. 


ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో సీబీఐ అరెస్టు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన శుక్రవారం రోస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ కేబినెట్ మాజీ మంత్రిని ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. 

సుప్రీంకోర్టులో విజయ్ మాల్యాకు చుక్కెదురు.. ముంబై కోర్టులో జరుగుతున్న విచారణను అడ్డుకోలేమని చెప్పిన ధర్మాసనం

Latest Videos

తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 28న సిసోడియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ముందు హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సిసోడియాను సీబీఐ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని ‘ఎన్డీటీవీ’ నివేదించింది. 

సిసోడియా దేశ రాజధానిలో లిక్కర్ పాలసీని రూపొందించడంలో అవకతవకలకు పాల్పడ్డారని అవినీతి ఆరోపణను ఎదుర్కొంటున్నారు. ా పాలసీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేశారు. తరువాత సీబీఐ విచారణకు ఆదేశించారు. అప్పటి నుంచి దర్యాప్తు మొదలుపెట్టిన ఏజెన్సీ పలువురు పేర్లను ఛార్జ్ షీట్ లో పొందుపర్చింది. ఈ క్రమంలో గత ఆదివారం ఉదయం నుంచి ఆయనను విచారించిన సీబీఐ సాయంత్రం అరెస్టు చేసింది.

నల్లగా ఉందని భార్యను హతమార్చిన భర్త.. కర్నాటకలో ఘటన

మరుసటి రోజు ప్రత్యేక కోర్టులో సీబీఐ హాజరుపరిచి ఐదు రోజుల రిమాండ్ కోరింది. ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియాను సరైన, న్యాయంగా దర్యాప్తు చేయడానికి, ఆయన నుంచి వాస్తవమైన, చట్టబద్ధమైన సమాధానాలు పొందాలని ఏజెన్సీని ఆదేశిస్తూ రిమాండ్ కు అనుమతి ఇచ్చింది. గత రెండు సందర్భాల్లో ఈ కేసు దర్యాప్తులో సిసోడియా చేరినప్పటికీ.. పరీక్ష, విచారణ సమయంలో అతడిని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని కూడా గమనించినట్లు ఈ సందర్భంగా న్యాయమూర్తి చెప్పారని ‘జీ న్యూస్’ నివేదించింది. అతడిపై వచ్చిన నేరారోపణ సాక్ష్యాలను చట్టబద్ధంగా వివరించడంలో ఆయన విఫలం అయ్యాడని పేర్కొన్నారు. 

కాగా.. ఈ అరెస్టు జరిగిన తరువాత సిసోడియా తన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే గతంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న మరో మంత్రి సత్యేందర్ జైన్ కూడా తన పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అయిన అతిషి, సౌరభ్ భరద్వాజ్ లను మంత్రులుగా నియమించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎల్జీకి సిఫారుసు చేశారు.

మియో కమ్యూనిటీ కోసం మేవాట్‌లో తొలి ప్రైవేట్ యూనివర్సిటీ ప్రారంభించనున్న యూసుఫ్ ఖాన్

మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యేందర్ జైన్ తర్వాత ఏడాది వ్యవధిలో అరెస్టయిన రెండో ఢిల్లీ మంత్రి సిసోడియా కావడం గమనార్హం. 2012లో పార్టీ ఆవిర్భావం నుంచి ఆప్ ను స్థాపించి కేంద్ర ప్రభుత్వాలపై యుద్ధానికి దిగిన మాజీ బ్యూరోక్రాట్ కేజ్రీవాల్ కు వీరిద్దరూ ఎంతో నమ్మకస్తులు.

click me!