అంతర్జాతీయ ఖురాన్ పఠనం పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత కంటెస్టెంట్ కారి మంజూర్ అహ్మద్

By Mahesh K  |  First Published Mar 3, 2023, 4:03 PM IST

అంతర్జాతీయ ఖురాన్ పఠనం పోటీల్లో భారత్ నుంచి వెళ్లిన ఏకైక కంటెస్టెంట్ కారి మంజూర్ అహ్మద్ నాలుగో స్థానాన్ని గెలిచారు. అసోంకు చెందిన కారి ఈజిప్టులో నిర్వహించిన ఈ పోటీలో పాల్గొన్నారు.
 


న్యూఢిల్లీ: ఈజిప్టులో జరిగిన అంతర్జాతీయ ఖురాన్ పఠనం పోటీల్లో భారత్ నుంచి పాల్గొన్న 26 ఏళ్ల కారి మంజూర్ అహ్మద్ నాలుగో స్థానంలో నిలిచారు. కారి మంజూర్ అహ్మద్ గతంలో టర్కీ, మలేషియాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొని వరుసగా ఐదో, తొమ్మిదో స్థానాల్లో నిలిచారు. కారి మంజూర్ అహ్మద్ దక్షిణ అసోం కరీంగంజ్ జిల్లా కాలిగంజ్ గ్రామానికి చెందిన నివాసి.

ఈజిప్టులో ఖురాన్ పఠన పోటీలో నాలుగో స్థానంలో నిలిచి గెలవడంపై ఆయన ఆవాజ్ ది న్యూస్ అనే వెబ్ సైట్‌‌తో మాట్లాడుతూ, ఈ ప్రతిష్టాత్మక పోటీలో 133 కోట్ల భారతీయుల తరఫున తాను హాజరుకావడం గర్వంగా ఉన్నదని అన్నారు. అన్ని మతాల్లోని సారం ఒకటే అని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఎక్కడా విద్వేషం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తనకు మతాలకు అతీతంగా ప్రజల నుంచి మద్దతు లభించిందని వివరించారు. 

Latest Videos

Also Read: మియో కమ్యూనిటీ కోసం మేవాట్‌లో తొలి ప్రైవేట్ యూనివర్సిటీ ప్రారంభించనున్న యూసుఫ్ ఖాన్

‘ఖురాన్ పఠనానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటి పాటిస్తూ పఠిస్తే ప్రతి ఒక్కరూ వారి జీవితంలో విజయవంతులవుతారు. ఖురాన్‌ను భిన్నమైన కోణంలో లవ్ చేసేవాడిగా తనను తాను వర్షించుకుంటానని చెప్పారు. ఖురాన్ ఎక్కువ మంది చదవాలని, అలా చదివిన వారు క్రమంగా మితభాషులవుతారని, ఎక్కువ తెలివిమంతులు అవుతారని అన్నారు. తద్వార శాంతి సమన్వయాలు సమాజంలో పైచేయి సాధిస్తూ ఉంటాయని వివరించారు.

ఈజిప్టు ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 65 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, కారి మంజూర్ అహ్మద్ భారత్ నుంచి వెళ్లిన ఏకైక అభ్యర్థి. ఆ పోటీ మూడు దశల్లో జరిగింది. చివరిగా తొమ్మిది మందిలో కారి మంజూర్ అహ్మద్ నాలుగో స్థానాన్ని గెలిచారు.

click me!