రాత్రంతా సీబీఐ ఆఫీసులోనే మనీష్ సిసోడియా.. వైద్య పరీక్షల అనంతరం నేడు కోర్టు ముందుకు..

Published : Feb 27, 2023, 09:16 AM IST
రాత్రంతా సీబీఐ ఆఫీసులోనే మనీష్ సిసోడియా.. వైద్య పరీక్షల అనంతరం నేడు కోర్టు ముందుకు..

సారాంశం

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఆదివారం సాయంత్రం సీబీఐ అరెస్టు చేసింది. రాత్రంతా ఆయన దేశ రాజధానిలోని సీబీఐ మెయిన్ ఆఫీసులోనే ఉన్నారు. సిసోడియాను సోమవారం కోర్టు ఎదుట హాజరుపర్చనున్నారు. 

లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టు అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రధాన కార్యాలయంలో రాత్రి గడిపారు. ఆదివారం ఆయనను ఎనిమిది గంటలకు పైగా ప్రశ్నించిన సీబీఐ సాయంత్రం సమయంలో అరెస్టు చేసింది. అయితే సోమవారం ఆయనను కోర్టులో హాజరుపరచనుంది. దాని కంటే ముందు సిసోడియాకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

నేడు మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు.. కట్టుదిట్టమైన భద్రత మధ్య మొదలైన పోలింగ్

దేశ రాజధానిలో కొత్త మద్యం విక్రయ విధానాన్ని తీసుకురావడంలో సిసోడియాతో పాటు మరి కొందరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2021 పాలసీని రూపొందించడంలో మద్యం కంపెనీలు పాలుపంచుకున్నాయని, దీని కోసం ‘సౌత్ గ్రూప్’ అని పిలిచే మద్యం లాబీ ద్వారా రూ.100 కోట్ల కిక్‌బ్యాక్‌లు చెల్లించారని సీబీఐ వాదిస్తోంది.

పదో తరగతి విద్యార్థిని పరీక్ష రాయడం కోసం గ్రీన్ కారిడార్.. ఎక్కడంటే..

సిసోడియా అరెస్టు అయిన తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన కుటుంబాన్ని కలిశారు. ఈ సందర్భంగా ఈ అరెస్టుపై కేజ్రీవాల్ విమర్శలు చేశారు. ప్రజలు తప్పకుండా స్పందిస్తారని హెచ్చరించారు.

‘‘మనీష్ నిర్దోషి. అతడి అరెస్ట్ డర్టీ పాలిటిక్స్. సిసోడియా అరెస్టుతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అందరూ చూస్తున్నారు. ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటారు. దీనిపై ప్రజలు స్పందిస్తారు. ఇది మా స్ఫూర్తిని మరింత పెంచుతుంది. మా పోరాటం మరింత బలపడుతుంది’’ అని ట్వీట్ చేశారు. 

Bharat Jodo yatra 2.0: భారత్ జోడో యాత్ర 2.0 ను ప్రారంభించాలనుకుంటున్నాం: జైరాం రమేశ్

సిసోడియా అరెస్టుపై మరో ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘సీబీఐ పూర్తిగా కేంద్రం కనుసన్నల్లో నడుస్తున్నది. మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేస్తుందని మాకు తెలుసు. ఈ ఎజెన్సీలు ఎలా పని చేస్తాయో ముందే పసిగట్టేయడం, ఊహించడం బాధాకరం’ అని అన్నారు.  అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలను బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా ఖండించారు. సీబీఐని కేంద్ర ప్రభుత్వ దుర్వినియోగపరుస్తున్నదన్న ఆప్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. సిసోడియా విద్యా రంగంలో మంచి పనులు చేసి ఉండొచ్చని, కానీ  దాని ఆధారంగా చేసుకొని లిక్కర్ పాలసీలో అవినీతికి పాల్పడడని చెప్పలేమని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం