మణిపూర్ హింసాకాండ.. నిరాశ్రయులైన 14 వేల మంది విద్యార్థులు.. వారిలో ఎంత మంది తిరిగి బడికి వెళ్తున్నారంటే ?

Published : Aug 03, 2023, 02:41 PM IST
మణిపూర్ హింసాకాండ.. నిరాశ్రయులైన 14 వేల మంది విద్యార్థులు.. వారిలో ఎంత మంది తిరిగి బడికి వెళ్తున్నారంటే ?

సారాంశం

మణిపూర్ లో చెలరేగుతున్న హింసాకాండ వల్ల పాఠశాలకు వెళ్లే అనేక మంది చిన్నారులు నిరాశ్రయులు అయ్యారు. ఇలాంటి విద్యార్థులు దాదాపు 14 వేల మంది ఉంటే.. వారిలో 93 శాతం మందిని సమీపంలోని పాఠశాలల్లో చేర్పించామని కేంద్ర మంత్రి నేడు రాజ్యసభలో వెల్లడించారు.

మణిపూర్ లో హింసాకాండ కారణంగా ఇప్పటి వరకు 14,000 మందికి పైగా పాఠశాల విద్యార్థులు నిరాశ్రయులయ్యారు. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి రాజ్యసభలో ఈ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. నిరాశ్రయులైన వారిలో 93 శాతం మంది పిల్లలను సమీప పాఠశాలలో చేర్పించినట్లు ఆమె వెల్లడించారు.

హర్యానా అల్లర్లు.. నుహ్ లో మరో రెండు మసీదులకు నిప్పు 

‘‘ప్రస్తుతం మణిపూర్ లో నెలకొన్న పరిస్థితుల కారణంగా 14,763 మంది పాఠశాలకు వెళ్లే పిల్లలు నిరాశ్రయులయ్యారు. నిర్వాసితులైన విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రతి పునరావాస శిబిరానికి ఒక నోడల్ అధికారిని నియమించాం.’’ అని పేర్కొన్నారు. 

హింసకు సంబంధించిన సమస్యలు, రవాణా, తల్లిదండ్రులు, పిల్లల్లో భయాందోళనలు నెలకొనడమే హాజరు శాతం తగ్గడానికి కారణం విద్యాశాఖ అధికారి ఒకరు ‘టైమ్స్ నౌ’తో తెలిపారు. నిరాశ్రయులైన 93.5 శాతం మంది విద్యార్థులను సమీపంలోని పాఠశాలలో ఉచితంగా చేర్చుకున్నామని పేర్కొన్నారు.

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సీమా హైదర్ ? ‘ఎ టైలర్ మర్డర్ స్టోరీ’కి ఆడిషన్స్ ఇచ్చిన పాకిస్థాన్ మహిళ

కాగా.. తమను ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు బదిలీ చేయాలని కోరుతూ ఇటీవల మణిపూర్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థుల బృందం అధికారులకు లేఖ రాసింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల దృష్ట్యా వారు ఈ ఆందోళన వ్యక్తం చేశారు. 

బద్రీనాథ్ జాతీయ రహదారిపై భారీగా కూలిన కొండచరియలు.. నిలిచిన రాకపోకలు

 మే 3వ తేదీ నాటి నుంచి చెలరేగిన అల్లర్లలో 160 మందికి పైగా మరణించారు.  ఇళ్లు, దుకాణాలు, వాహనాలతో సహా పెద్ద సంఖ్యలో ఆస్తులు ధ్వంసమయ్యాయి. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మీటీ కమ్యూనిటీ డిమాండ్ కు నిరసనగా కొండ జిల్లాల్లో 'ట్రైబల్ సాలిడారిటీ మార్చ్' నిర్వహించిన తరువాత మణిపూర్ లో జాతి ఘర్షణలు చెలరేగాయి. దీనిపై విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !