
న్యూఢిల్లీ:మణిపూర్ అల్లర్లు మత ఘర్షణలు కావని ముంబైకి చెందిన ఓస్వాల్డ్ కార్డినల్ గ్రేసియాస్ ప్రకటించారు.మణిపూర్ లో జరిగిన ఘటన మతపరమైన రంగు పులిమినట్టుగా తెలిపారు. ఇది మత ఘర్షణ కాదని ప్రకటించారు. గిరిజన సంఘర్షణగా తేల్చి చెప్పారు. గిరిజనుల్లోని రెండు తెగల మధ్య ఘర్షణగా కార్డినల్ ఆర్చి బిషప్ ప్రకటించారు.
ఈ హింసలో కొన్ని చర్చిలు, దేవాలయాలు కూడ ధ్వంసమైన విషయాన్ని కార్డినల్ ప్రకటించింది.పరిస్థితి మరింత దిగజారేలా చూడవద్దని కోరింది. శాంతి, సామరస్యం నెలకొల్పేందుకు ప్రయత్నాలు సాగించాలని సూచించింది.