మంగళయాన్ కి చిక్కిన ఫోబస్ చంద్రుడు... ఫోటోలు వైరల్

By telugu news teamFirst Published Jul 4, 2020, 10:48 AM IST
Highlights

జూలై ఒక‌ట‌వ తేదీ ఈ చిత్రాల‌ను మార్స్ ఆర్బిటార్ తీసింది. అంగార‌క గ్ర‌హానికి సుమారు 4200 కిలోమీట‌ర్ల దూరంలో ఫోబ‌స్ చంద్రుడు ఉన్న‌ట్లు గుర్తించారు.  మార్స్ ఆర్బిటార్‌.. ఆ చంద్రుడిని సుమారు 7200 కిలోమీట‌ర్ల దూరం నుంచి చిత్రీక‌రించిన‌ట్లు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.  
 

భారత అంత‌రిక్ష సంస్థ‌(ఇస్రో)కు చెందిన మంగళయాన్ ఆర్బిటార్ అరుదైన చిత్రాల‌ను తీసింది.  ఆ ఆర్బిటార్‌లో ఉన్న మార్స్ క‌ల‌ర్ కెమెరాకు.. చంద్రుడు చిక్కాడు.  మార్స్ గ్ర‌హానికి అత్యంత స‌మీపంగా, అత్యంత పెద్ద‌గా ఉన్న ఫోబ‌స్ చంద్రుడి ఫోటోల‌ను మార్స్ ఆర్బిటార్ పంపిన‌ట్ల ఇస్రో వెల్ల‌డించింది. 

 జూలై ఒక‌ట‌వ తేదీ ఈ చిత్రాల‌ను మార్స్ ఆర్బిటార్ తీసింది. అంగార‌క గ్ర‌హానికి సుమారు 4200 కిలోమీట‌ర్ల దూరంలో ఫోబ‌స్ చంద్రుడు ఉన్న‌ట్లు గుర్తించారు.  మార్స్ ఆర్బిటార్‌.. ఆ చంద్రుడిని సుమారు 7200 కిలోమీట‌ర్ల దూరం నుంచి చిత్రీక‌రించిన‌ట్లు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.  

210 మీట‌ర్ల రెజ‌ల్యూష‌న్ ఉన్న చిత్రాల‌ను రిలీజ్ చేశారు.  6 ఎంసీసీ ఫ్రేమ్స్ దృశ్యాల నుంచి ఈ చిత్రాల‌ను జ‌న‌రేట్ చేశారు.  క‌ల‌ర్ క‌ర‌క్ష‌న్ కూడా చేసిన‌ట్లు ఇస్రో చెప్పింది.  

A recent image of the mysterious moon of Mars, Phobos, as captured by India's Mars Orbiter Mission

For more details visit https://t.co/oFMxLxdign pic.twitter.com/5IJuSDBggx

— ISRO (@isro)

 

ఫోబ‌స్ చంద్రుడు ఎక్కువ శాతం కార్బ‌న్ మూల‌కాల‌తో ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు.  ఫోబ‌స్‌లో భారీ లోయ‌ల్ని కూడా గుర్తించారు. స్టిక్‌నే క్రాట‌ర్‌తో పాటు సాక్లోస్కీ, రోచ్‌, గ్రిల్‌డ్రిగ్ లాంటి అగాధాల‌ను మార్స్ ఆర్బిటార్ ప‌సిక‌ట్టిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు.

కాగా... 2014, సెప్టెంబ‌ర్ 24వ తేదీన  మంగ‌ళ‌యాన్‌కు చెందిన మార్స్ ఆర్బిటార్ మిష‌న్‌ను అత్యంత విజ‌య‌వంతంగా క‌క్ష్య‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఏపీలోని శ్రీహ‌రికోట నుంచి పీఎస్ఎల్వీ రాకెట్‌లో మంగ‌ళ‌యాన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను 2013, న‌వంబ‌ర్ 5న‌ ప్ర‌యోగించారు.  కాగా.. దీనికి మామ్ అని పేరు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. 
 

click me!
Last Updated Jul 4, 2020, 10:48 AM IST
click me!