ఆస్పత్రిలో కరోనా వైరస్ కు మందులు ఇప్పిస్తామని నమ్మించి బయటకు తీసుకుని వెళ్లి ఇద్దరు బాలురు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో జరిగింది.
రాయపూర్: ఆస్పత్రిలో కరోనా వైరస్ మందులు ఇప్పిస్తామని నమ్మించి ఓ బాలికపై ఇద్దరు బాలురు దారుణానికి ఒడిగట్టారు. బాలికపై ఇద్దరు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన సంఘటన చత్తీస్ గడ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది.
కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిందని బాలికకు చెప్పి, నయం చేయడానికి తాము ఆస్పత్రిలో మందులు ఇప్పిస్తామని నమ్మించి ఇద్దరు బాలురు ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు.
కరోనా వైరస్ కు మందులు ఇప్పిస్తామని చెప్పి తన అక్కను ఇద్దరు బాలురు ఆమెపై అత్యాచారం చేశారని బాధితురాలి తమ్ముడు తల్లిదండ్రులకు చెప్పాడు. తనను బయటకు తీసుకుని వెళ్లి తనపై అఘాయిత్యం చేశారని బాలిక తల్లిదండ్రులకు చెప్పిందని, దాంతో వారు ఫిర్యాదు చేశారని ఏఎస్పీ ప్రతిభా పాండే చెప్పారు.
బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నిందితుల్లో ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నామని, మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.