మంగళూరు ఎయిర్‌పోర్టులో బాంబు: ఉద్యోగం రాలేదు, అందుకే పెట్టా..!

By Siva KodatiFirst Published Jan 22, 2020, 5:25 PM IST
Highlights

కొద్దిరోజుల క్రితం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఓ వ్యక్తి బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 

కొద్దిరోజుల క్రితం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఓ వ్యక్తి బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతోనే తాను ఈ చర్యకు పాల్పడినట్లు పేర్కొన్నాడు.

Also Read:‘ఆయనకు ఇద్దరు’.. భర్తను చెరో మూడు రోజులు పంచుకున్న భార్యలు.. మరి ఆదివారం?

కర్ణాటక రాష్ట్రం మణిపాల్‌కు చెందిన ఆదిత్య రావు అనే వ్యక్తి మంగళూరు బాంబు ఘటనకు సంబంధించి తమ ఎదుట లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతనికి ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని.. అనంతరం మంగళూరు పోలీసులకు అప్పగిస్తామని వెల్లడించారు.

కాగా.. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం టికెట్ కౌంటర్ వద్ద ఎయిర్‌పోర్ట్ పోలీసులు ఓ అనుమానాస్పద బ్యాగ్‌ను కొనుగొన్నారు. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్ అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించి అందులో పేలుడు పదార్థం ఉన్నట్లు గుర్తించారు.

Also Read:రైల్లో హెచ్ఐవి బాధిత మహిళపై ఒకరు రేప్, వీడియో తీసిన మిత్రుడు

బ్యాగ్‌లోని మెటల్ కాయిన్ బాక్స్‌లో పేలుడు పదార్థం, లోహపు ముక్కలు నింపినట్లు తేలింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ బ్యాగ్‌ను ఓ వాహనంలో ఎయిర్‌పోర్ట్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పరిసర ప్రాంతాల్లో వున్న ప్రజలను ఖాళీ చేయించి బాంబును పేల్చివేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లోని సీసీటీవీ ఫుటేజ్ సాయంతో బాంబు పెట్టిన వ్యక్తిని గుర్తించి, మీడియాకు విడుదల చేశారు. అతనిని అరెస్ట్ చేసే లోగానే ఆదిత్య రావు స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. 

click me!