పాట్నా: రాత్రివేళ రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న హెచ్ఐవి బాధిత మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఈ సంఘటన బీహీర్ రాష్ట్రంలోని క్లైమూర్ జిల్లా భాభువా రైలులో చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు అరెస్టయ్యారు. 

పాట్నా, భాభువా ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలులో రాత్రి వేళ 22 ఏళ్ల హెచ్ఐవి బాధిత మహిళ ఒంటరిగా ప్రయాణిస్తోంది. చయతా గ్రామానికి చెందిన బీరేంద్ర ప్రకాష్ సింగ్ (26), దీపక్ సింగ్ లు రైలు ఎక్కారు. 

ఒంటరిగా ఉన్న మహిళను చూసి ఇద్దరిలో ఒకరు ఆమెపై అత్యాచారం చేశాడు. మరొకతను దాన్ని వీడియో తీశాడు. ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు రైల్వే పోలీసులు చెప్పారు. బాధిత మహిలను భాభువా సదర్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. 

బాధిత మహిళ భర్త ఎయిడ్స్ తో మరణించాడు. ఆమెకు కూడా అతని నుంచి ఎయిడ్స్ సోకింది. చికిత్స నిమిత్తం వెళ్లి ఆమె పాట్నా నుంచి తిరిగి వస్తుండగా ఆమెపై అత్యాచారం జరిగింది.

బాధిత మహిళపై అత్యాచారం చేసిన తర్వాత పారిపోతుండగా రైల్వే పోలీసులు ఒకతన్ని పట్టుకున్నారు. మరొకతన్ని ఆ తర్వాత అరెస్టు చేశారు.