500 ఏళ్ల కల నెరవేరింది: రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ట తర్వాత యోగి ఆదిత్యనాథ్

By narsimha lode  |  First Published Jan 22, 2024, 2:09 PM IST


 అయోధ్యలో   రామ మందిరంలో రాముడి విగ్రహా  ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తైన తర్వాత  సభను నిర్వహించారు.ఈ సభలో  ప్రధాని మోడీ సహా పలువురు పాల్గొన్నారు. 



న్యూఢిల్లీ:500 ఏళ్ల కల నెరవేరిందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  చెప్పారు.అయోధ్యలో రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత నిర్వహించిన సభలో   ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రసంగించారు.దేశమంతా రామ నామమే మార్మోగుతుందని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.మనమంతా త్రేతాయుగంలోకి వచ్చినట్టుగా ఉందన్నారు.  రాం నగరికి వచ్చిన మీ అందరికీ స్వాగతం అని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఎన్నో పోరాటాల తర్వాత ఈ అద్భుత ఘట్టం సాకారమైందని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.ఈ అద్భుత ఘట్టాన్ని తాను మాటల్లో వర్ణించలేనని ఆయన వివరించారు.ఈ క్షణం కోసం దేశమంతా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాణప్రతిష్టతో  దేశమంతా  రామయుంగా మారిందని  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.

అయోధ్య ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతుందన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టి, అంకిత భావంతో ఇదంతా సాధ్యమైందన్నారు.అయోధ్యకు పూర్వవైభవం తెచ్చేందుకు  వందల కోట్లు కేటాయించిన విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. అనుకున్న చోటే రామాలయం నిర్మించిన విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు.

Latest Videos

రాముడి ప్రాణ ప్రతిష్ట తిలకించిన ఈ తరం ప్రజలు ఎంతో అదృష్టవంతులని  యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట రామ రాజ్యాన్ని సాకారం చేస్తుందని ఆయన  తెలిపారు.రాముడు మనకు ఎంతో ఓర్పును నేర్పించారని  యూపీ సీఎం గుర్తు చేశారు.

click me!