
కర్నాటక : ప్రేమను కాదన్నారనో, బ్రేకప్ అయ్యిందనో, పెళ్లికి నిరాకరించారనో, మోసం చేశారనో love copuleలో ప్రేయసో, ప్రియుడో ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు తరచూ చూస్తుంటాం. అయితే, ఇది దీనికి పూర్తిగా భిన్నం. ప్రేమకథల్లో ఉండాల్సిన ట్విస్టులతో పాటు..ఇందులో మరో ఊహించని ట్విస్ట్ ఉంది. karnatakaలోని చిక్కమగళూరు జిల్లాలో ఓ విచిత్ర ప్రేమ కథ వెలుగు చూసింది.ఆ ప్రేమకథ ప్రియుడి suicideతో విషాదాంతమైంది.
ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని చేతన్ (31)గా గుర్తించారు. అతను ఆత్మహత్య చేసుకోవడమే కాక... ప్రేయసి కోసం ఇప్పటి వరకు చేసిన ఖర్చులు లేఖ రాసి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని ఆయన ఉత్తరం రాయడం విశేషం. పోలీసుల కథనం మేరకు.. చిక్కమగళూరు జిల్లా shankarapuraకు చెందిన చేతన్ తొమ్మిదేళ్లుగా ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరు తరచూ కలుసుకునేవారు. ఆమె సరదాలు, సంతోషాలు కోసం చేతనే డబ్బులు ఖర్చు చేసేవాడు. అలా ఆమె కోసం బాగా ఖర్చు చేయాల్సి వస్తోందని స్నేహితులతో చెప్పి వాపోయేవాడు చేతన్.
సరకు రవాణా వాహనాలు నడుపుతూ జీవించే అతను తన ఆదాయంలో అధికభాగం ఆమె కోసమే ఖర్చు చేసేవాడట. ఇటీవల పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించగా ఆమె ససేమిరా అంది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన చేతన్.. చివరికి జీవితంపై విరక్తి చెంది సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్నేహితులు పోలీసులకు తెలిపారు. అతడి మృతదేహం వద్ద ఒక లేఖ లభించింది. అందులో నా ప్రేయసి సరదాల కోసం రూ.4.50 లక్షలు ఖర్చు చేశానని పేర్కొన్నాడు. ఆ మొత్తాన్ని ఆమె నుంచి వసూలు చేసి తన కుటుంబానికి అందించాలని కోరాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో నిరుడు నవంబర్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్లోని లలిత్ పూర్ లో ఒక యువకుడు రైలు కింద పడి suicide చేసుకున్నాడు. ఒక యువతి ఈ యువకుడిని ప్రేమ పేరుతో వంచించడమే కాకుండా లక్ష రూపాయలు తీసుకుని మోసం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కలత చెందిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ యువకుడు train tracksపై కూర్చుని తనకు ఆ యువతి చేసిన మోసాన్ని వివరిస్తూ ఒక వీడియో రికార్డు చేసి social mediaలో షేర్ చేశాడు. యువకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఆ యువతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం లలిత్‌పూర్- బీనా మార్గంలోని రైలు పట్టాలపై ఒక యువకుడి మృతదేహం కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అదించారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుడిని కక్రువా గ్రామానికి చెందిన దేవేంద్ర (30)గా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.ఈ సందర్భంగా మృతుని సోదరుడు ఇంద్ర పాల్ మాట్లాడుతూ తన సోదరుడు పనారీ గ్రామంలో ఉంటూ truck driver గా పని చేస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. కొంతకాలం క్రితం తన సోదరుడి వద్ద నుంచి లక్ష రూపాయల సొమ్మును ఓ యువతి తీసుకుని.. ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా తన సోదరుడిని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.