
సీనియర్ కాంగ్రెస్ నేత, లోక్‌సభ ఎంపీ మనీష్ తివారీ రాజ్యసభ పని తీరుపై మండిపడ్డారు. ఎగువ సభ రాష్ట్రాల హక్కుల కోసం పోరాడాలనే దాని ప్రధాన లక్ష్యాన్ని నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. అలాంటప్పుడు ఈ సభ దేశానికి అవసరమా అని ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికలకు తమ పార్టీ నామినేషన్ల జాబితాపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “రాజ్యసభ ఇప్పుడు పార్కింగ్ స్థలంగా మారింది” అని అన్నారు.
అనేక మంది ప్రముఖ కాంగ్రెస్ నాయకులుకు ఈ సారి రాజ్యసభకు టిక్కెట్టు దక్కలేదు. ఈ నేపథ్యంలోనే మనీష్ తివారి ఇలా మాట్లాడారు. “ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. రాజ్యసభ ఏర్పాటైన లక్ష్యాలకు అనుకూలంగా విధులను నిర్వహించడం పివేసింది. రాజ్యసభ ఇప్పుడు పార్కింగ్ స్థలంగా మారింది. ఇప్పుడు దేశానికి రాజ్యసభ అవసరమా లేదా అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది ” అని ఆయన ANI తో చెప్పారు. “ దశాబ్దాలుగా రాజ్యసభ తన ప్రధాన లక్ష్యాన్ని నెరవేర్చడంలో విఫలమైంది, అంటే రాష్ట్రాల హక్కులను సాధించడం. ఒక ప్రాథమిక ప్రశ్న అడిగే సమయం వచ్చింది. భారతదేశానికి ఫెడరల్ సెకండ్ ఛాంబర్ ఎందుకు అవసరం? అది లేకుండా భారతదేశం పనిచేయలేదా రాజ్యసభను రద్దు చేయాలా ? ’’ అని అన్నారు.
Singer KK : ప్రముఖ గాయకుడు కేకే మృతి..
మనీష్ తీవారి ప్రశ్నలు దేశ వ్యాప్తంగా చర్చనీయాశం అయ్యాయి. దీని ఏర్పాటు, నిర్మాణం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. ఈ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియాలో ఎగువ సభ 19520 ఏప్రిల్ 3వ తేదీన ఉనికిలోకి వచ్చింది. అదే సంవత్సరం మే 13న దాని మొదటి సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే లోక్‌సభ అధికారాలను పర్యవేక్షించేందుకు రాజ్యాంగ నిర్మాతలు దీనిని రూపొందించారు.
ఎగువ సభను ఏర్పాటు చేయడం అనేది ఉభయసభల సూత్రంపై ఆధారపడి ఉంటుంది. దీనికి చట్టాలను రూపొందించడానికి లేదా మార్చడానికి రెండు వేర్వేరుగా ఏర్పాటు అయ్యే పార్లమెంటు సమావేశాల సమ్మతి అవసరం. ఇది 1787లో US రాజ్యాంగాన్ని ఆమోదించడంతో అమలులోకి వచ్చింది. రాజ్యాంగ సభలో భారతదేశానికి ద్విసభ కేంద్ర శాసనసభ ప్రతిపాదన వచ్చినప్పుడు, ఎనిమిది రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించి సభ్యులు చివరకు ఏకాభిప్రాయానికి వచ్చారు.
మహారాష్ట్రలో దారుణం.. 6 గురు చిన్నారులను బావిలో పడేసిన తల్లి.
రాజ్యసభలో గరిష్టంగా 250 మంది సభ్యులు ఉండవచ్చు, వారిలో ఎక్కువ మంది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల ద్వారా ఆరు సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు. 12 మందిని కళ, సాహిత్యం, విజ్ఞానశాస్త్రం, సామాజిక సేవలకు అందించిన సేవల ఆధారంగా భారత రాష్ట్రపతి నియమిస్తారు. అయితే లోక్ సభకు పూర్తిగా ఐదేళ్లకు ఒక సారి ఎన్నికలు జరుగుతాయి. ఐదేళ్ల కాలం తరువాత లోక్ సభ రద్దు అవుతుంది. కానీ రాజ్యసభ ఎప్పుడూ రద్దు కాదు. అందుకే దీనిని శాస్వత రద్దు కాదు. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒక సారి మూడింట రెండొంతుల మంది రాజీనామా చేస్తారు.
లోక్‌సభ ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికలు. ఇవి ప్రజల నిర్ణయానికి అద్దం పడుతాయి. అంటే ప్రజలు ఎన్నుకున్న సభ్యులు ఈ సభకు ప్రాతినిధ్యం వహిస్తారు. రాజ్యసభకు పరోక్షంగా ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు ఎన్నుకున్న నాయకులు, ఈ సభ సభ్యులను ఎన్నుకుంటారు. ఎగువ సభకు, లోక్‌సభకు అధికారాలు సమానంగా ఉంటాయి. ప్రభుత్వం తీసుకొచ్చే చాలా బిల్లులను ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. కానీ ద్రవ్య బిల్లులు మాత్రం లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఏదైనా బిల్ చట్టంగా మారాలంటే దానిని ఉభయ సభలు ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం దానిని భారత రాష్ట్రపతి ఆమోదించాలి.
అయితే గత 25 ఏళ్లుగా రాజ్యసభ ఉత్పాదకత క్షీణిస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నియమించిన సచివాలయం విశ్లేషణ నివేదిక అందించింది. నివేదిక ప్రకారం.. 1997 వరకు రాజ్యసభ ఉత్పాదకత 100 శాతం అంతకంటే ఎక్కువ ఉండగా 1998, 2004 మధ్య కాలంలో అది 87 శాతానికి పడిపోయింది. ఇది 2005, 2014 మధ్య 76 శాతానికి పడిపోయింది. 2015, 2019 మధ్య 61 శాతానికి పడిపోవడం సభ ఏర్పాటు చేసిన స్ఫూర్తికి విఘాతం కలుగుతోందనేది అందరిలో ఏర్పడిన భావన. ఇలాంటి అభిప్రాయంతోనే నేడు కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ ఆ వ్యాఖ్యలు చేశారు.