లింగ మార్పిడి చికిత్సతో స్త్రీగా మార్పు.. త్వరలోనే లింగ సవరణతో కూడిన పాస్‌పోర్టు జారీ..!

By Sumanth KanukulaFirst Published Nov 24, 2022, 12:14 PM IST
Highlights

లింగమార్పిడి శస్త్ర  చికిత్స చేసుకున్న ఓ వ్యక్తి త్వరలోనే జెండర్ కరెక్షన్‌తో కూడిన పాస్‌పోర్టును అందుకోనున్నారు. జెండర్ కరెక్షన్‌తోతో కూడిన మొదటి బ్లూ బుక్‌ను ప్రాసెస్ చేసిన తర్వాత బెంగళూరులోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి ఇది ఒక మైలురాయిగా నిలవనుంది. 

లింగమార్పిడి శస్త్ర  చికిత్స చేసుకున్న ఓ వ్యక్తి త్వరలోనే జెండర్ కరెక్షన్‌తో కూడిన పాస్‌పోర్టును అందుకోనున్నారు. పాస్‌పోర్ట్‌లో దరఖాస్తుదారు అభ్యర్థన మేరకు మగ నుంచి స్త్రీకి లింగ మార్పు నమోదు చేయబడిందని.. ఇది ఇప్పుడు చివరి దశలో భాగంగా పోలీసు క్లియరెన్స్ కోసం పంపబడిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పోలీసు వెరిఫికేషన్ పూర్తి కాగానే త్వరలోనే సరిచేసిన పాస్‌పోర్ట్‌ను జారీ చేయనున్నట్టుగా చెప్పాయి. జెండర్ కరెక్షన్‌తోతో కూడిన మొదటి బ్లూ బుక్‌ను ప్రాసెస్ చేసిన తర్వాత బెంగళూరులోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి ఇది ఒక మైలురాయిగా నిలవనుంది. 

వివరాలు.. బెంగళూరు లాల్‌బాగ్‌లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి కొన్ని నెలల క్రితం పశ్చిమ బెంగళూరు నివాసి నుంచి పాస్‌పోర్ట్‌లో లింగ వివరాలను పురుషుని నుంచి స్త్రీగా మార్చాలని కోరుతూ దరఖాస్తు వచ్చింది. 28 ఏళ్ల వ్యక్తి తాను లింగమార్పిడి చికిత్స చేయించుకున్నట్టుగా పేర్కొన్నారు. ఈ మేరకు టైమ్స్ ఇండియా రిపోర్ట్ చేసింది. 

‘‘లింగ శస్త్రచికిత్స తర్వాత పాస్‌పోర్ట్‌లో లింగ సవరణ కోరుతూ దరఖాస్తు వచ్చింది. ఇటీవలి సంవత్సరాలలో ఈ విధమైన దరఖాస్తు రావడం ఇదే తొలిసారి. మేము దానిని స్వీకరించడాన్నిం సంతోషిస్తున్నాము. మేము దీన్ని వేగంగా ప్రాసెస్ చేసే దిశగా పనిచేశాము’’అని బెంగళూరులోని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి కృష్ణ కె అన్నారు.డిజిటలైజేషన్ తర్వాత బెంగళూరు పాస్‌పోర్ట్ కార్యాలయంలో పురుషుడి నుంచి స్త్రీగా లేదా స్త్రీ నుంచి పురుడిగా మారిన తర్వాత లింగ సవరణ సవరణకు సంబంధించిన మొదటి ఉదాహరణ ఇదే అని తెలిపారు. మాన్యువల్ ప్రక్రియ జరుగుతున్న రోజుల్లో అలాంటిది జరిగిందో లేదో ఖచ్చితంగా తెలియదని చెప్పారు. 

పాస్‌పోర్ట్ చట్టం, నిబంధనల ప్రకారం.. లింగ సవరణ కోరుకునే వ్యక్తులు తప్పనిసరిగా లింగమార్పిడి శస్త్రచికిత్స లేదా వాజినోప్లాస్టీ చేసిన సర్జన్ నుంచి నివేదికతో సహా తగిన సహాయక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కేసు విషయానికి వస్తే.. దరఖాస్తుదారు తమిళనాడులోని చెంగల్‌పట్టులోని ఒక ఆసుపత్రిలో జరిగిన లింగమార్పిడి శస్త్రచికిత్సకు సంబంధించిన వైద్య రికార్డులను అందించారు. కానీ కోవిడ్ సంక్షోభం కారణంగా ఆ ఆస్పత్రి మూసివేయబడింది. బెంగళూరు పాస్‌పోర్ట్ అధికారుల విచారణలో కూడా ఇదే విషయం వెల్లడైంది. 

అయితే తాము దరఖాస్తుదారుని నిరాశపరచకుండా పాస్‌పోర్ట్ జారీ చేయడానికి ఆసక్తిగా ఉన్నామని కృష్ణ చెప్పారు. కర్ణాటకలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించమని సలహా ఇవ్వబడిందని తెలిపారు. అక్కడ అర్హత కలిగిన వైద్యుడి నుంచి దరఖాస్తుదారు స్థితిని ధృవీకరించవచ్చని చెప్పారు. ఈ క్రమంలోనే దరఖాస్తుదారు నేలమంగళలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆశ్రయించారు. అక్కడ సీనియర్ డాక్టర్ దరఖాస్తుదారు కొత్త లింగ స్థితిని ధృవీకరించార. ఆ రిపోర్టు పాస్‌పోర్ట్ కార్యాలయానికి సమర్పించబడింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విధానాలలో భాగంగా డాక్టర్‌తో కరస్పాండెన్స్ ద్వారా జారీ చేసిన సర్టిఫికేట్ ప్రామాణికతను అధికారులు నిర్దారించారు. పాస్‌పోర్ట్‌లో దరఖాస్తుదారు అభ్యర్థన మేరకు పురుషుడి నుంచి స్త్రీకి లింగ మార్పు నమోదు చేయబడింది. ఇది ఇప్పుడు చివరి దశలో భాగంగా పోలీసు క్లియరెన్స్ కోసం పంపబడిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.


2021 మే నెలలో బెంగళూరులోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి 57 ఏళ్ల వ్యక్తి నుంచి పాస్‌పోర్ట్‌పై లింగ సవరణను ట్రాన్స్‌జెండర్‌గా మార్పు కోసం దరఖాస్తు వచ్చింది. అధికారులు దరఖాస్తును ప్రాసెస్ చేసి లింగమార్పిడి చేయడాన్ని సూచించడానికి లింగ కాలమ్ కింద X గుర్తుతో కొద్ది రోజుల్లోనే తాజా పాస్‌పోర్ట్‌ను జారీ చేశారు. బెంగళూరులో ఒక దరఖాస్తుదారు లింగ సమాచారాన్ని ట్రాన్స్‌జెండర్‌గా మార్చడాన్ని ఎంచుకోవడం ఇదే మొదటిసారి అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

పాస్‌పోర్ట్‌లో (X అనే గుర్తుతో ) ప్రదర్శించబడేలా లింగమార్పిడిని ట్రాన్స్‌జెండర్‌గా మార్చడాన్ని ఎంచుకున్న దరఖాస్తుదారు (అతను/ఆమె) లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకోనప్పుడు ఎటువంటి సహాయక పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. కేవలం స్వీయ ప్రకటన సరిపోతుంది.

click me!