దారుణం.. యూట్యూబ్ లో చేతబడి వీడియోలు చూసి.. ఏడేళ్ల చిన్నారి నరబలి...!

By SumaBala BukkaFirst Published Oct 31, 2022, 7:56 AM IST
Highlights

యూట్యూబ్ లో చేతబడి వీడియోలు చూసి ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఇంటిముందు ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసి నరబలి ఇచ్చాడు. 

హర్యానా : జనాలకు యూ ట్యూబ్ పిచ్చి ముదిరిపోతోంది. వంటల దగ్గరినుంచి అణుబాంబు తయారీ వరకు... ఏది చేయాలన్నా యూట్యూబ్ వీడియోలు చూస్తే చాటు.. పరిజ్ఞానం ఉచితంగా అందుబాటులో దొరుకుతుంది. దీంతో అక్రమాలకు పాల్పడుతున్నవారు. దొంగతనాలు చేస్తున్నవారు.. ఏకంగా బాంబులు తయారు చేస్తున్న వారూ అక్కడక్కడా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ కోవలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

యూట్యూబ్ వీడియోలు చూసి చేతబడి నేర్చుకోవడానికి ఓ ఏడేళ్ల చిన్నారిని హత్య చేశాడో దుర్మార్గుడు. వివరాల్లోకి వెడితే.. హరియాణా పానీపత్ లో ఏడేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిందితుడు యోగేశ్.. ఓ బాలికను నరబలి ఇచ్చిన విషయం మీద కీలక వివరాలు రాబట్టారు పోలీసులు. అమ్మాయిలను లొంగదీసుకోవడానికి యోగేశ్ చేతబడి నేర్చుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు. యూట్యూబ్ లో వీడియోలు చూసేవాడని, చేతబడిలో ప్రావీణ్యం సంపాదించడానికి బాలికను చంపాలని ప్రణాళిక రచించాడని పేర్కొన్నారు. అందుకే ఏడేళ్ల చిన్నారిని టార్గెట్ చేసిన యోగేశ్.. దీపావళి రోజున ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని హత్యాచారం చేసి కవర్ లో చుట్టి ఆమె ఇంటి పెరట్లో పడేశాడు. 

సోదరుడితో భార్య వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, వారిద్దరికీ పెళ్లి చేసిన భర్త...

ఇలాంటి ఘటనే, జూన్ 4న మీరట్ లో వెలుగులోకి వచ్చింది. పక్కింటి వాళ్ళతో తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన ఓ వ్యక్తి యూట్యూబ్ లో చూసి బాంబు తయారు చేయడం నేర్చుకున్నాడు. ఆపై అది పనిచేస్తుందో లేదో పరీక్షించి కూడా చూశాడు. ఓకే అనుకున్న తర్వాత దాన్ని పక్కింటి వారిపై ప్రయోగించాడు. ఉత్తరప్రదేశ్లో భాగ్ పట్ లో జరిగిన ఈ ఘటన పోలీసులనే విస్తుపోయేలా చేసింది. పక్కింటి వాళ్ళతో తరచూ గొడవలు జరుగుతుండడంతో విసిగిపోయిన 45 ఏళ్ల రణవీర్ సింగ్ ప్రతీకారం కోసం పరిపరివిధాలా ఆలోచించాడు. 

చివరికి యూట్యూబ్ లో చూసి బాంబు తయారు చేయడం నేర్చుకున్నాడు. తయారీ పూర్తయిన తర్వాత దానిని పొలాల్లోకి తీసుకెళ్లి పలుమార్లు పరీక్షించి చూశాడు. పనిచేస్తోందని నిర్ధారించుకున్న తర్వాత తాను ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్న వ్యక్తి ఇంటి ప్రధాన ద్వారానికి బాంబు అమర్చాడు. విషయం తెలియని ఆ ఇంటి యజమాని 17 ఏళ్ల కుమారుడు గౌతమ్ సింగ్ డోర్ తెరవడంతో బాంబు పెద్ద శబ్దంతో పేలి పోయింది. ఈ ఘటనలో కుర్రాడి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. 

వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘాతుకానికి పాల్పడింది రణవీర్ సింగేనంటూ బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. యూట్యూబ్ లో చూసి రణవీర్ సింగ్ బాంబులు తయారు చేయడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని భాగ్ పట్ ఎస్పీ నీరజ్ జాదౌన్ పేర్కొన్నారు. తమ ఎదుట బాంబులు తయారు చేయమని కోరగా వెంటనే తయారు చేసి చూపించాడు అన్నారు. దానికి మరికొన్ని అదనపు ఏర్పాటు చేసి బాంబును మరింత శక్తివంతంగా తయారు చేశాడని తెలిపారు. సమాజానికి హాని చేసే ఇలాంటి వీడియోలను తొలగించాలంటూ యూట్యూబ్ కు లేఖ రాసినట్లు ఎస్పి తెలిపారు. 

click me!