
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అద్భుత ఘటన జరిగింది. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఓ ఏడాది చిన్నారి చివరికి మృత్యుంజయుడుగా నిలిచాడు. వాషింగ్ మిషన్ లో పడిపోయిన ఆ చిన్నారి కోమాలోకి వెళ్ళాడు. ఏడు రోజుల తర్వాత తిరిగి కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలోని వసంత్ కుంజ్ లో చోటుచేసుకుంది.
కొన్ని ఘటనలు విన్నప్పుడు ఎలా జరిగాయి? ఎందుకు జరిగాయి? అర్థం కాదు. కావాలని చేశారా? అనే అనుమానాలూ వస్తాయి... కానీ ఆయా ఘటనల్లో అద్భుతాలు జరిగినప్పుడు మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు.. ఇలా జరిగే అవకాశం ఉందా అని దేవుడి లీల అని నమ్ముతారు. అలాంటి ఓ విచిత్రమైన ఘటనే ఇది. యేడాదిన్నర చిన్నారి వాషింగ్ మెషీన్ లో పడ్డాడు. ఎలా పడ్డాడనేది.. ఊహించగలిగారు కానీ వాస్తవం ఎవ్వరూ చూడలేదు. ఆ తరువాత అదృష్టవశాత్తు వారం రోజుల కోమా తరువాత కోలుకున్నారు. ఇది మిరాకిల్.
ఈ ఘటన వివరాల్లోకి వెడితే.. ఢిల్లీ వసంత్ కుంజ్ ప్రాంతంలో నివసించే ఓ మహిళ బట్టలు పిండే నిమిత్తం ఇంట్లోని ఓ గదిలో ఉన్న వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసి, ఆన్ చేసి వెళ్ళింది. అది టాప్ లోడ్ మెషిన్. ఆ తర్వాత నుంచి ఆమె ఏడాదిన్నర కుమారుడు కనిపించలేదు. గదిలో ఉండాల్సిన బాబు కనిపించకపోవడంతో.. ఇల్లంతా వెతికింది. కుటుంబసభ్యులు చుట్టుపక్కల ఇళ్లలో కూడా వెతికారు. ఫలితం లేదు. అనుమానంతో వాషింగ్ మిషన్లో చూడగా సబ్బు నీళ్లలో బాబు ఉండడం కనిపించింది.
బాబోయ్.. వాషింగ్ మెషీన్ వృథానీరు ఇంటిముందుకు వస్తుందని.. మహిళను రాళ్లతో మోది హత్య...
అప్పటికే 15 నిమిషాల పాటు బాబు అందులో ఉన్నాడు. వెంటనే మిషన్ ని ఆఫ్ చేసి బాబును బయటకు తీసి కుటుంబ సభ్యుల సహాయంతో ఆసుపత్రికి పరుగులు పెట్టారు. ఈ విచిత్ర ఘటన విన్న వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. అప్పటికే బాబు అపస్మారక స్థితిలోకి చేరడంతో ఐసీఈలో చేర్చుకున్నారు. సబ్బు నీళ్లు, ఊపిరాడక ఆ చిన్నారి కోమాలోకి వెళ్లాడు. వైద్యులు ఐసీయూలో బాబుకి చికిత్స అందించారు. కోమాలో ఏడు రోజులపాటు వెంటిలేటర్ పై ఆ చిన్నారి మృత్యువుతో పోరాడాడు. ఆ తర్వాత మిరాకిల్ జరిగినట్టుగా పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడు.
అయితే, చిన్నారి వాషింగ్ మెషిన్ లో ఎలా పడ్డాడు అనే దానిపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. కుర్చీ మీదికి ఎక్కి వాషింగ్ మిషన్ లోకి ఎక్కి ఉండొచ్చని చిన్నారి తల్లి అనుమానిస్తుంది. అప్పుడప్పుడే కుర్చీలు, స్టూళ్లు ఎక్కడం నేర్చుకుంటున్నాడని తెలిపింది. ఇలాంటి ప్రమాదాల్లో బతికి బయటపడడం చాలా అరుదని. చిన్నారి కోలుకోవడం అద్భుతమైన విషయమని వైద్యులు అంటున్నారు. వాషింగ్ మెషిన్ లో సబ్బు నీళ్లలో అంతసేపు ఉండడం, ఏడాదిన్నర వయసు చిన్నారి కావడం వల్ల బాబుకి జీర్ణకోశ ఇన్ఫెక్షన్ తో పాటు..న్యుమోనియా కూడా సోకిందని వైద్యులు తెలిపారు.