
పూణే : భార్యకు తెలియకుండా మరో యువతితో illegal affair కొనసాగిస్తున్న ఆ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం పెంచుకున్న భార్య.. Technology సాయంతో భర్త గుట్టును బయట పెట్టింది. ఊహించని ఆ పరిణామంతో ప్రేయసితో కలిసి తుర్రుమన్నాడు ఆ భర్త.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..
పూణే పోలీసులు శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గుజరాత్ కు చెందిన సదరు వ్యక్తి ఓ వ్యాపార వేత్త. అతని భార్య కూడా అదే కంపెనీకి డైరెక్టర్ గా ఉంది. అయితే 41 యేళ్ల ఆ వ్యాపారవేత్త మరో యువతితో
Extramarital affair ఏర్పరచుకున్నాడు. వ్యాపారం పేరిట ఊర్లు తిరుగుతున్న అంటూ బిల్డప్ లు ఇచ్చేవాడు. అయితే, అతని వ్యవహారం ఆమెకు అనుమానం తెప్పించడం మొదలుపెట్టింది. దీంతో భర్త వాహనంలో
GPS పరికరాన్ని రహస్యంగా అమర్చింది.
నిరుడు నవంబర్లో బెంగళూరు వెళ్తున్నానని భార్యతో చెప్పాడు సదరు వ్యాపారి. కానీ, జీపీఎస్ లొకేషన్ మాత్రం ఆ వాహనం మహారాష్ట్రలోని పూణేలో ఉన్నట్టు చూపించింది. దీంతో ఆమె అనుమానం మరింత బలపడింది. వెంటనే భర్త బస చేసిన హోటల్ సిబ్బందిని ఆరా తీసింది. సీసీ ఫుటేజీని పరిశీలించగా మరో యువతితో అతగాడు లోపలికి వెళ్లడం కనిపించింది.
పైగా ఆమే తన భార్య అంటూ.. భార్య పేరిట ఉన్న ఆధార్ కార్డు చూపించాడట. ఆధార్ కార్డు తనదని, పరిశీలించకుండా రూమ్ ఎలా కేటాయించారంటూ ఆమె హోటల్ సిబ్బందిపై ఫైర్ అయ్యింది. అంతేకాదు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత పోలీసులు తాజాగా 419 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా, హోటల్ వ్యవహారం భార్యకు తెలిసిపోవడంతో సదరు వ్యాపారవేత్త, అతడి ప్రేయసి ఆ సమయంలోనే పరారయ్యారు. అప్పటి నుంచి వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరి 1న జరిగింది. భార్యకు ప్రభుత్వం Loanగా ఇచ్చిన డబ్బును తన సొంతం చేసుకునేందుకు ఆమె స్థానంలో వేరే మహిళలు భార్యగా చూపించి నగదు తీసుకుని పరారైన husband ఉదంతం ఇది. విస్సన్నపేటకు చెందిన చల్లా నిర్మల శ్రీసాయి స్వశక్తి సంఘంలో సభ్యురాలిగా ఉంటూ ఎప్పటికప్పుడు పొదుపు, గత రుణానికి సంబంధించిన మొత్తం అన్ని సక్రమంగా చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త శ్రీను మరో మహిళతో extra marital affair పెట్టుకొని 3 నెలల క్రితం భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టారు.
ఇదే సమయంలో నిర్మల సభ్యురాలిగా ఉన్న సంఘానికి ప్రభుత్వం రూ. 10 లక్షల నగదు రుణంగా మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని సంఘం అధ్యక్షురాలు సభ్యులందరికీ ఒక్కొక్కరికి రూ. లక్ష వరకు జమ చేశారు. నిర్మల పుట్టింటికి వెళ్లడంతో ఆమె Bank pass bookలో ఫోటోను మార్చాడు. అంతేకాదు సంతకాన్ని ఫోర్జరీ చేసి.. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను.. తన భార్యగా స్థానిక సప్తగిరి బ్యాంకు అధికారులను నమ్మించి.. నగదు మొత్తాన్ని విత్డ్రా చేశాడు.
విషయం తెలుసుకున్న నిర్మల బ్యాంకు అధికారులను ఆశ్రయించగా.. అప్పటికే శ్రీను నగదు డ్రా చేసిన మహిళతో ఉడాయించాడు. విషయం బయటకు వస్తే తమ బ్యాంకు పరువు పోతుందని భావించిన బ్యాంకు అధికారులు కొందరు గ్రామ పెద్దల సహాయంతో నిర్మలతో రాజీ చేసుకుని ఆమె పేరుతో కొత్త ఖాతా ప్రారంభించి.. కొంత నగదు అందులో జమ చేశారు. ఈ ఘటనపై బాధితురాలు నిర్మలను విచారించగా.. తన భర్త తనకు మంజూరు అయిన నగదుతో.. మరో మహిళతో పరారయ్యాడని తెలిపింది.
బ్యాంకు మేనేజర్ రఘును విచారించగా నిర్మల ఖాతాలో నగదు దుర్వినియోగం అయినా ఆమెకు ఎటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఆమెకు తెలియకుండా ఆమె భర్త డ్రా చేసి పరారైన మాట వాస్తవమేనని వెలుగు సిబ్బంది తెలిపారు.