Earthquake: ఉత్త‌రభార‌తంలో పలు చోట్ల భూ ప్రకంపనాలు.. భయాందోళనల్లో ప్రజలు!!

Published : Feb 05, 2022, 10:40 AM ISTUpdated : Feb 05, 2022, 01:22 PM IST
Earthquake: ఉత్త‌రభార‌తంలో పలు చోట్ల భూ ప్రకంపనాలు.. భయాందోళనల్లో ప్రజలు!!

సారాంశం

Earthquake: ఉత్తర భార‌త‌దేశంలో ప‌లు చోట్ల భూమి కంపించింది. జమ్మూకశ్మీర్‌లోని కాశ్మీర్ లోయ, జమ్మూ డివిజన్‌లోని పలు జిల్లాల్లో భూమి కంపించింది. శ‌నివారం ఉదయం భూ ప్రకంపనలు సంభ‌వించాయి.. కనీసం 20 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.   

Earthquake: ఉత్తర భార‌త‌దేశంలో ప‌లు చోట్ల భూమి కంపించింది. జమ్మూకశ్మీర్‌లోని కాశ్మీర్ లోయ, జమ్మూ డివిజన్‌లోని పలు జిల్లాల్లో భూమి కంపించింది. శ‌నివారం ఉదయం భూ ప్రకంపనలు సంభ‌వించాయి.. కనీసం 20 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం ఉదయం 9:46 గంటలకు సంభవించిందనీ, భూమికి  210 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.అలాగే.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, ఢిల్లీ లో కూడా భూమి కంపించింది. భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.

అలాగే.. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో కూడా శనివారం ఉదయం భూమి కంపించింది. ఈ భూకంప తీవ్ర‌త‌.. రిక్టర్ స్కేలుపై 3.6 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిన‌ట్టు,   భూమికి 10 కిలోమీటర్ల లోతులో, భూకంప కేంద్రం ఉత్తరకాశీకి వాయువ్యంగా 58 కి.మీ. లోతులో వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు ట్వీట్ చేశారు.

ఒక్కసారిగా భూమి కంపించడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూ ప్రకంపనలతో భయపడిన జనం ఇళ్లలోంచి బయటకు వచ్చి పరుగులు తీశారట. అయితే ఈ భూకంపంతో ఎలాంటి ఆర్ధిక నష్టం వాటిల్లలేదని సమాచారం. అలానే ఎలాంటి ప్రాణ నష్టం కూడా లేదని తెలుస్తోంది. ఈ ఘనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

అలాగే.. ఆఫ్ఘనిస్తాన్‌--త‌జ‌కిస్తాన్ స‌రిహ‌ద్దులో కూడా భూకంపం చోటు చేసుకున్నట్టునేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. ఈ భూకంప తీవ్ర‌త రిక్టార్ స్కేలు పై 5.9 తీవ్రతగా న‌మోదైన‌ట్లు, 9.45 నిమిషాల‌కు భూకంపం న‌మోదు అయిన‌ట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు ట్వీట్ చేశారు. 181 కిలోమీట‌ర్ల లోతులో భూమి కంపించిన‌ట్లు సెంట‌ర్ పేర్కొన్న‌ది.

 గత జనవరిలో కూడా అప్ఘానిస్థాన్లో భూకంపం సంభ‌వించింది.  భూకంపం ప్రభావానికి 26మంది ప్రాణాలు కోల్పోయారు. పలు కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. పశ్చి అఫ్ఘానిస్థాన్ లోని బాద్గీస్ లోని ఖాదీస్ జిల్లాలో భూ కంపానికి ప్రజలు అల్లాడిపోయారు. ఇళ్ల కప్పులు కూలిపోయి 26మంది మరణించారు. వీరిలో ఐదుగురు మహిళలతో పాటు నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu