విడోతో ఫేస్ బుక్ లో పరిచయం, పెళ్లి చేసుకుంటానంటూ శారీరకంగా వాడుకుని, వీడియోలు తీసి బెదిరింపు.. దీంతో...

Published : Nov 18, 2021, 09:33 AM IST
విడోతో ఫేస్ బుక్ లో పరిచయం, పెళ్లి చేసుకుంటానంటూ శారీరకంగా వాడుకుని, వీడియోలు తీసి బెదిరింపు.. దీంతో...

సారాంశం

బ్రింద ఒంటరితనాన్ని గమనించిన దీపక్ ఆమెతో ఎక్కువ సమయం గడిపేవాడు. అలా వారిద్దరూ ప్రేమలో పడ్డారు. బ్రిందను పెళ్లి చేసుకుంటానని దీపక్ చెప్పాడు. వారిద్దరూ శారీరకంగా కూడా ఏకమయ్యారు. అప్పుడప్పుడూ దీపక్ బ్రింద నుంచి డబ్బు తీసుకునేవాడు. కానీ కొన్ని రోజుల తరువాత బ్రిందకు దీపక్ గురించి ఒక విషయం తెలిసింది. 

హర్యాణా రాష్ట్రంలోని సోనిపత్ నగరంలో ఇటీవలే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు.  మృతురాలి చెల్లెలు  తన అక్క ఆత్మహత్య చేసుకోవడానికి ఒక వ్యక్తి కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసు విచారణ చేస్తుండగా.. చాలా నిజాలు బయటపడ్డాయి.

పోలీసు ఆ కథనం ప్రకారం sonipat నగరంలో నివసించే బ్రింద (34) (పేరు మార్చబడినది). అనే మహిళ భర్త కొన్ని నెలల కిందట చనిపోయాడు. వింతతువైన ఆమెకు కొంత కాలం క్రితం ఫేస్ బుక్ లో దీపక్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం వారిద్దరినీ ఛాటింగ్ వరకూ తీసుకువచ్చింది. అక్కడితో ఆగితే ఇంత దారుణం జరగకపోయేది. 

తరచూ facebook లో ఆమెతో చాటింగ్ చేసే దీపక్ మెల్లగా ఆమెను మంచి చేసుకున్నాడు. అలా వారిద్దరూ దగ్గరయ్యారు. దీపక్ మాయమాటలను బ్రింద నమ్మేసింది. అతను మంచివాడని అనుకుంది. బ్రింద ఒంటరితనాన్ని గమనించిన దీపక్ కూడా ఆమెతో ఎక్కువ సమయం గడిపేవాడు. 

అలా వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా కొద్ది రోజుల తరువాత బ్రిందను పెళ్లి చేసుకుంటానని దీపక్ చెప్పాడు. దీంతో వాళ్లు ఫేస్ బుక్ లోనే కాదు బయట కూడా కలవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే వారిద్దరూ శారీరకంగా కూడా ఏకమయ్యారు. అప్పుడప్పుడూ దీపక్ బ్రింద నుంచి డబ్బు తీసుకునేవాడు. కానీ కొన్ని రోజుల తరువాత బ్రిందకు deepak గురించి ఒక విషయం తెలిసింది. 

ఒక రోజు brinda ఇంటికి ఓ యువతి వచ్చింది. ఆమె దీపక్ భార్యనని చెప్పింది. ఇక ముందు దీపక్ ను బ్రింద కలవొద్దని, కలిస్తే పరిణామాలు బాగుండవని thretan చేసింది. దీంతో బ్రింద.. దీపక్ గురించి ఆరా తీసింది. అతనికి నిజంగానే వివాహం అయ్యిందని తెలిసింది. ఈ విషయంలో దీపక్ ను బ్రింద నిలదీసింది. వెంటనే తన వద్ద తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని లేకపోతే అతడిపై చీటింగ్ కేసు పెడతానని హెచ్చరించింది. 

NIA raids: కల్యాణ్ రావు సహా మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లలో సోదాలు

ఆమె మాటలకు దీపక్ భయపడలేదు. తాను డబ్బు తిరిగి ఇవ్వనని చెప్పాడు. ఎక్కువగా మాట్లాడితే.. తన దగ్గర తామిద్దరి private videos ఉన్నాయని.. వాటిని internet లో వైరల్ చేస్తానని black mailచేశాడు. పైగా తనకు ఇంకా డబ్బులు కావాలని అన్నాడు. అంతేకాదు ఆ రోజు బ్రింద మీద rape కూడా చేశాడు. 

దీపక్ పెట్టే harrassement భరించలేక, తాను మోసపోయానని బ్రింద తన చెల్లెలితో జరిగిందంతా చెప్పింది. ఒకరోజు బ్రింద ఉరివేసుకుని చనిపోయింది. suicideకి ముందు దీపక్ తనను మోసం చేశాడని, అతని పేరు చేతిమీద రాసుకుని చనిపోయింది. పోలీసులు బ్రింద suicide caseలో దీపక్ ను అరెస్ట్ చేశారు. అతని మీద చీటింగ్, బ్లాక్ మెయిల్ కేసులు నమోదు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం