అమానుషం.. కరుస్తుందని కుక్కను బండికి కట్టి.. కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లి.. చివరికి..

By SumaBala BukkaFirst Published Mar 20, 2023, 6:54 AM IST
Highlights

ఓ వ్యక్తి కుక్కను తన బండికి కట్టుకుని రెండున్నర కిలోమీటర్ల మేర ఈడ్చుకువెళ్లాడు. అది గమనించిన స్థానికులు అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు. 

ఉత్తర ప్రదేశ్ :  మూగజీవం పట్ల ఓ వ్యక్తి అమానుషంగా వ్యవహరించిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో శనివారం ఇస్మాయిల్ అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ కి ఓ కుక్కను కట్టి రెండున్నర కిలోమీటర్ల మేర ఈడ్చుకువెళ్లాడు. ఈ అమానుష ఘటనను ఎవరో  వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. కాగా,  ఇస్మాయిల్ తన బండికి కుక్కను కట్టి విజయనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్ విహార్ ఔట్ పోస్టు నుంచి వెళుతున్నాడు. అవుట్ పోస్ట్ దగ్గరికి రాగానే స్థానికులు అతడిని గమనించి.. ఆపమని కేకలు వేశారు. అతను వినకపోవడంతో టూ వీలర్ మీద వెంటపడ్డారు. వెంబడించి ఆపారు. 

మరికొందరు పీపుల్స్ ఫర్ యానిమల్స్ సభ్యులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని మీద  జంతువులను హింసిస్తున్నాడన్న కేసు నమోదు చేశారు. అయితే ఇలా ఎందుకు చేసావు అని ఇస్మాయిల్ ను అడగగా.. ఆ కుక్క చాలా మందిని కరిచిందని తెలిపాడు. అందుకే… దాన్ని తమ ప్రాంతానికి దూరంగా వదిలేయడానికి తీసుకు వెళుతున్నానని పోలీసులకు  ఇస్మాయిల్ తెలిపాడు. 

క్రికెట్ ఆడుతూనే కుప్పకూలిపోయాడు.. హార్ట్ ఎటాక్‌తో హఠాన్మరణం

ఇదిలా ఉండగా, మార్చి 16న తమిళనాడులో ఓ ఘటన అందరికీ కలిచి వేసింది. పెంపుడు జంతువులు యజమానికి విశ్వాసంగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. ఆ మూగజీవాలు తమ యజమాని పట్ల చూపించే ప్రేమకు వెలకట్టలేం. యజమాని కనిపించకపోతే నిద్రాహారాలు మాని ఎదురుచూసే ఘటనలు ఎన్నో వింటాం. అలాంటి ఓ హృదయాన్ని మెలిపెట్టే ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంగా ఓ వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు.  అక్కడ అతని పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. అయితే మృతిచెందిన వ్యక్తితో పాటు అతడి పెంపుడు శనకం కూడా ఆసుపత్రికి వచ్చింది. 

యజమాని మృతి చెందడంతో.. అది తెలియని ఆ శూనకం మూడు నెలలుగా తన యజమాని కోసం నిరీక్షిస్తూ  ఆసుపత్రి బయటే  ఎదురుచూస్తోంది.ఈ ఘటన తమిళనాడులోని సేలంలో ఉన్న మోహన్ కుమార్ మంగళం ప్రభుత్వ ఆసుపత్రిలో చూసిన వారందరిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఆస్పత్రిలో మూడు నెలల క్రితం ఓ వ్యక్తి గుండెపోటుతో జాయిన్ అయి.. చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు.  

ఆ సమయంలో అతనితోపాటు అతని పెంపుడు కుక్క కూడా ఆసుపత్రికి వచ్చింది. అతను మృతి చెందిన తర్వాత.. ఆస్పత్రి వర్గాలు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే, ఆ పెంపుడు కుక్కను ఎవరు గమనించలేదు. మృతదేహాన్ని తీసుకువెళ్లిన బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ, ఆ శునకం మాత్రం యజమాని కోసం ఎదురుచూస్తూ.. మూడు నెలలుగా అక్కడే ఉంది. ఆస్పత్రిలో విధుల్లో ఉన్న సిబ్బంది దాన్ని చూసి ఎన్నిసార్లు అక్కడి నుంచి తోలేసినా.. మళ్లీ మళ్లీ వస్తోంది. దీంతో దాని పరిస్థితి అర్థం చేసుకున్న భద్రతా సిబ్బంది ఆహారం అందిస్తున్నారు.

click me!