స్నేహితుడికి మందు తాగించి, ఆపై యాసిడ్ తో దాడి.. బెంగళూరులో వ్యక్తి అరెస్ట్..

Published : Jun 01, 2022, 09:58 AM IST
స్నేహితుడికి మందు తాగించి, ఆపై యాసిడ్ తో దాడి.. బెంగళూరులో వ్యక్తి అరెస్ట్..

సారాంశం

ఆదివారం బెంగళూరులో దారుణం జరిగింది. స్థానిక కబ్బన్‌పేటలో ఓ  వ్యక్తి  తన సహోద్యోగిపై వ్యక్తిగత కక్షల కారణంగా యాసిడ్‌ పోశాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరు : Bengaluruలోని కబ్బన్‌పేటలో ఆదివారం ఓ వ్యక్తి తన సహోద్యోగిపై acid పోశాడు. యాసిడ్ దాడిలో బాధితురాలికి 30 శాతం కాలిన గాయాలయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని arrest చేశారు. 

బెంగళూరులోని కబ్బన్‌పేటలో ఆదివారం పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి వ్యక్తిగత శత్రుత్వంతో తన సహోద్యోగిపై యాసిడ్‌ పోశాడు. ఈ దాడిలో బాధితుడు 30 శాతం గాయపడ్డాడు. ఇది గమనించిన మిగతావారు వెంటనే అతడిని క్టోరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను అయితే నగరంలోని విక్టోరియా ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. 

ఘటనానంతరం హలసూరు గేట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన రోజు ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఆ తరువాత వీరిమధ్య చిన్నపాటి విషయమై గొడవ జరిగిందని విచారణలో తేలింది. కొద్దిసేపటికే, వారి మధ్య నెలకొన్న వాగ్వాదం తీవ్రమైంది. నిందితుడు, జనతా అనే వ్యక్తి, కోపంతో, బాధితుడిపై యాసిడ్ చల్లాడు. దీంతో బాదితుడు గట్టిగా కేకలు వేస్తూ అరవడంతో.. గమనించిన వారు అతడిని కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. 

ఈ ఘటన విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని.. నిందితుడిని అరెస్ట్ చేశారు. బెంగళూరులో నెల రోజుల వ్యవధిలో యాసిడ్ దాడి జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు, ఏప్రిల్ 28న నగరంలోని కామాక్షిపాళ్యం పరిధిలో యాసిడ్ దాడి కేసు నమోదైంది, 23 ఏళ్ల మహిళ నిందితుడి అడ్వాన్స్‌లను తిరస్కరించడంతో యాసిడ్ దాడి జరిగింది. 

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 1న ఇలాంటి ఘటనే Rajanna Sirisilla District వేములవాడ మున్సిపాలిటీ పరిధి తిప్పాపూర్ గ్రామంలో జరిగిన Chicken గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. హరీష్ అనే వ్యక్తి చికెన్ సెంటర్ నిర్వహిస్తుండగా సప్తగిరి కాలనీకి చెందిన చిరు వ్యాపారులు చికెన్ కొనుగోలు చేశారు. ఇంటికెళ్లి వంట చేసుకున్న తరువాత చికెన్ లో నాణ్యత లేదంటూ షాపు వద్దకు వచ్చి గొడవ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. 

దీంతో ఆగ్రహానికి గురైన చిరు వ్యాపారులు చికెన్ షాపు నిర్వాహకుడు హరీష్ తో పాటు అడ్డుగా వచ్చిన మరికొందరిపై Acidతో attack చేశారు. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వేములవాడ పట్టణ సీఐ వెంకటేష్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu