కరోనా భయంతో ఆసుపత్రి భవనంపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య

Published : Mar 19, 2020, 10:21 AM IST
కరోనా భయంతో ఆసుపత్రి భవనంపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య

సారాంశం

 కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఢిల్లీలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చికిత్స పొందుతున్న ఐసోలేషన్ వార్డు బ్లాక్ నుండి కిందకు దూకి ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఢిల్లీలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చికిత్స పొందుతున్న ఐసోలేషన్ వార్డు బ్లాక్ నుండి కిందకు దూకి ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఢిల్లీ ఇందిరాగాంంధీ ఎయిర్ పోర్టులో ఓ 35 ఏళ్ల వ్యక్తిని  కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఓ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బుధవారం నాడు రాత్రి 9 గంటల సమయంలో ఆయనను ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉంచారు.

Also read:సెలవులు రద్దు, ఆరు కరోనా పాజిటివ్ కేసులు: ఈటల రాజేందర్

అతని నుండి రక్తపు నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు. రక్తపు నమూనాల రిపోర్టు కోసం వైద్యులు ఎదురు చూస్తున్నారు. ఈ రిపోర్టులు రాకముందే అతను ఆసుపత్రి 7వ అంతస్తు నుండి కిందకు దూకాడు. 

తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆ వ్యక్తి చాలా కాలంగా అస్ట్రేలియా రాజధాని సిడ్నీలో నివాసం ఉంటున్నాడు. అతను సిడ్నీ నుండి ఇండియాకు రావడంతో అధికారులు పరీక్షల కోసం ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
 

PREV
click me!

Recommended Stories

ఢిల్లీలో అసలేం జరుగుతోంది? మళ్లీ కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
Rahul Gandhi: మరోసారి దద్దరిల్లిన దేశ రాజధాని.. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది.?