ముంబయి పోలీసు అధికారి భార్యపై లైంగిక వేధింపులు.. పోలీసులు ఏం చేశారంటే?

By Mahesh KFirst Published Feb 6, 2023, 5:46 PM IST
Highlights

మహారాష్ట్రలో ఓ పోలీసు అధికారి భార్యపై లైంగిక వేధింపులు జరిగాయి. ఆమె పని చేస్తున్న స్కూల్ నుంచి సమీపంలోని తన ఇంటికి వస్తుండగా ఆ దుండగుడు వెంబడించాడు. బలవంతంగా ఆమె ఇంటిలోకి చొరబడే ప్రయత్నం చేశాడు. 
 

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఓ పోలీసు అధికారి భార్యకే లైంగిక వేధింపులు తప్పలేవు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ మాజీ ఉద్యోగి ముంబయి పోలీసు అధికారి భార్య, సర్వోదయ నగర్‌లోని ప్రీ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ స్కూల్ సమీపంలోని బిల్డింగ్‌లో రెండో ఫ్లోర్‌లో సూరజ్ లక్కం అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఆ స్కూల్ కూడా పోలీసు అధికారికి బంధువులదే. ఆ స్కూల్ నుంచి సమీప దూరంలోనే పోలీసు కుటుంబం నివసిస్తున్నది. 

గతంలోనూ సూరజ్ లక్కం అనే వ్యక్తికి, ఆమెకు గొడవ కావడంతో ఒకరికి ఒకరు ముఖ పరిచయం ఉన్నది. ఆదివారం ఆమె నర్సరీ స్కూల్ నుంచి వెనక్కి తిరిగి వస్తుండగా సూరజ్ లక్కం ఆమె వెంట పడ్డాడు. ఇది గమనించి ఆమె వేగంగా ఇంటికి నడవడం మొదలు పెట్టింది. ఇంటికి వెళ్లి వెంటనే డోర్ క్లోజ్ చేసుకుంది. ఆమె దుస్తులు మార్చుకుంటూ ఉండగా డోర్ కీ నుంచి ఎవరో చూస్తున్నట్టు అనుమానించింది. 

Also Read: ట్రాక్ మార్చిన కేటుగాళ్లు.. నకిలీ నోట్లు కాదు, నకిలీ కాయిన్స్ తయారీ.. 9 లక్షల ఫేక్ కాయిన్స్ సీజ్

ఆ తర్వాత ఇంటి బయట ఆ వ్యక్తి హంగామా చేశాడు. పెద్ద గొంతుతో అరుపులు వేశాడు. అప్పుడు ఇంటి పని మనిషి వచ్చింది. సేఫ్టీ డోర్ ఓపెన్ చేసింది. దీంతో అతను బలవంతంగా ఇంటిలోకి చొరబడి ఆమె షర్ట్‌ను చింపేశాడు. ఆమెను అసభ్యకరంగా తడిమాడు. 

ఈ ఘటన గురించి బద్లాపూర్ (వెస్ట్) పోలీసు అధికారి మాట్లాడుతూ, ఆ మహిళను లక్కం వెంబడించి ఒంటరిగా ఉండగానే ఇంటిలోకి చొరబడ్డాడని వివరించారు. ఆమె తనను తాను రక్షించుకుని ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదని,కానీ, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. గేట్ తెరువాలని, ఆమెతో మాట్లాడేది ఉన్నదని ఆ వ్యక్తి బిగ్గరగా కేకలు వేశాడని, దీనికి సమాధానంగా ఆమె తనతో కాదు.. తన భర్తతో మాట్లాడాలని సమాధానం ఇచ్చినట్టు వివరించారు. ఇది ఆ వ్యక్తికి కోపం తెప్పించిందని, ఆ మహిళ దుస్తులు చింపి నగ్నంగా చేస్తానని బెదిరించినట్టు పేర్కొన్నారు. ఆ వ్యక్తి పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.

click me!