నడిరోడ్డులో వ్యక్తిని అటకాయించి కాల్పులు, రూ.5లక్షలు దోపిడీ.. చోధ్యం చూసిన వాహనదారులు..

Published : Jan 17, 2023, 01:33 PM IST
నడిరోడ్డులో వ్యక్తిని అటకాయించి కాల్పులు, రూ.5లక్షలు దోపిడీ.. చోధ్యం చూసిన వాహనదారులు..

సారాంశం

దొంగల్లో ఒకరు బాధితుడిని కొట్టే సమయంలో వారి సమీపంలో.. ఒక కారు ఆగింది. అయితే దొంగలు ఆ కారు మీద కూడా కాల్పులు జరపడం సీసీ టీవీలో నమోదయ్యింది. 

న్యూఢిల్లీ : ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గత శనివారం ఉత్తర ఢిల్లీలో రద్దీగా ఉండే రోడ్డు మీద రాత్రివేళ.. కొంతమంది దుండగులు ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు. అతని దగ్గరున్న రూ. 5 లక్షలతో పరారయ్యారు. బాధితుడు రూప్ నగర్‌లో హన్నీ కుమార్ (42). అతను కిందపడ్డ తన బైక్ తో, తుపాకీ గాయంతో రోడ్డుపై అలాగే చాలాసేపు కూర్చుని ఉన్నాడు. చాలా వాహనాలు వెడుతున్నాయి. కానీ ఎవ్వరూ అతడిని పట్టించుకోలేదు. 

ఆ రోజు రాత్రి రెండు బైక్‌లపై వెళుతున్న నలుగురు దుండగులు మరో మోటార్‌సైకిల్‌పై వచ్చిన బాధితుడిని అనుసరించి రోడ్డు పక్కన బలవంతంగా ఆపి, ఈ దాడికి పాల్పడ్డారు. సమాచారం తెలియడంతో పోలీసులు నిందితుల కోసం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కానీ దుండగులు హెల్మెట్ ధరించి ఉండడంతో వారిని గుర్తించలేకపోయారు.

బుద్గాంలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా సిబ్బంది..

పిలియన్ రైడింగ్ చేస్తున్న ఇద్దరు దొంగలు బాధితుడిపై దాడి చేసి అతని కుడి కాలుపై కాల్చారు. అతను తన యజమాని చెప్పినట్టుగా ఖాతాదారుల నుంచి డబ్బులు వసూలు చేసుకుని వస్తున్నాడు. ఆ నగదుతో కూడిన అతని బ్యాగ్‌ని లాక్కోవాలనే ప్రయత్నంలో వారు అతన్ని చాలాసార్లు తన్నారు. దొంగల్లో ఒకరు బాధితుడిని కొట్టే సమయంలో వారి సమీపంలో ఒక కారు వచ్చి ఆగింది. అయితే నిందితుడు కారుపై తన తుపాకీని పేల్చడం కూడా కనిపించింది. ఆ తరువాత దొంగలు బైక్‌లపై వివిధ మార్గాల్లో పారిపోయారు.

ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ వ్యాపారి దుకాణంలో పనిచేస్తున్న బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ సంఘటన సాయంత్రం రద్దీగా ఉండే రహదారిపై అనేక కార్లు, బైక్‌లు అటూ, ఇటూ వెడుతుండగా జరిగింది. సంఘటన సమయంలో ఒక ఆటో కూడా అటునుంచి వెళ్లడం కనిపించింది.

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు