ప్రియురాలితో షాపింగ్.... భార్యకు అడ్డంగా దొరికిపోయిన భర్త....!

Published : Oct 14, 2022, 09:50 AM IST
ప్రియురాలితో షాపింగ్.... భార్యకు అడ్డంగా దొరికిపోయిన భర్త....!

సారాంశం

అతనిని కొడుతుంటే.. ప్రియురాలు అడ్డు రాగా... ఆమెను కూడా కూడా కొట్టడం గమనార్హం. వీళ్ల గొడవ చూసి.. దుకాణదారుడు బయటకు వెళ్లిపోమ్మని అరవడం గమనార్హం.  

చాలా సినిమాల్లో చూసే ఉంటారు... హీరో ప్రియురాలితో కలిసి బయటకు వెళితే...భార్యకు దొరికిపోతూ ఉంటారు. తాజాగా... ఇలాంటి సంఘటన నిజ జీవితంలో చోటుచేసుకుంది.  ఓ వ్యక్తి భార్య పుట్టింటి వెళ్లడంతో ప్రియురాలితో కలిసి షాపింగ్ కి వెళ్లాడు. కర్వాచౌత్ సందర్భంగా ప్రియురాలికి నచ్చినవి కొనిపెడతామని అనుకున్నాడు. అయితే... అదే షాపింగ్ మాల్ కి భార్యకూడా వచ్చింది. ఇంకేముంది... భార్య అతనిని తుక్కు తుక్కు కొట్టేసింది. ఈ సంఘటన ఘజియాబాద్ లో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య తన స్నేహితులతో కలిసి భర్త కాలర్ పట్టుకుని కొట్టింది. ఈ సంఘటన జరిగిన సమయంలో... జనమంతా గుమ్మిగూడటం గమనార్హం. అతనిని కొడుతుంటే.. ప్రియురాలు అడ్డు రాగా... ఆమెను కూడా కూడా కొట్టడం గమనార్హం. వీళ్ల గొడవ చూసి.. దుకాణదారుడు బయటకు వెళ్లిపోమ్మని అరవడం గమనార్హం.

 


నిజానికి.. ఇటీవల భార్యభర్తల మధ్య గొడవ జరిగగిందట. ఆమె అలిగి.. తన పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త పుట్టింటికి వెళ్లడంతో... అతను చక్కగా ప్రియురాలితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టడం గమనార్హం. ప్రియురాలితో కలిసి షాపింగ్ కి వెళ్లాడు. అదే షాపింగ్ కి అతని భార్య... తన తల్లితో కలిసి వచ్చింది.. ఆ సమయంలో ఆమె తన భర్తను మరో మహిళతో గుర్తించింది.ఇక అంతే రచ్చ రచ్చగా మారింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


కర్వా చౌత్ అనేది హిందూ పండుగ, ఇది దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ రోజున, వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం, ప్రార్థనలు చేస్తారు. కర్వా చౌత్ కృష్ణ పక్షం  నాల్గవ రోజు లేదా హిందూ క్యాలెండర్ నెల కార్తీకంలో చీకటి పక్షం రోజున జరుపుకుంటారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్