మాస్కో-డిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు: దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు

By narsimha lodeFirst Published Oct 14, 2022, 9:48 AM IST
Highlights

మాస్కో నుండి ఢిల్లీకి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానాన్ని బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీ చేశారు. ఇవాళ తెల్లవారుజామున మూడున్నర గంటలకు విమానం మాస్కో నుండి ఢిల్లీకి చేరుకుంది. 
 

న్యూఢిల్లీ: మాస్కో నుండి ఢిల్లీకి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఢిల్లీకి వచ్చిన విమానాన్ని బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీ చేశారు. విమానంలో ఎలాంటి బాంబు లేదని తేల్చారు. విమానంలో బాంబు ఉందని  బెదిరింపు ఫోన్ కాల్ పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రష్యా రాజధాని మాస్కో నుండి గురువారం నాడు రాత్రి విమానం బయలుదేరింది.ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ బాంబు బెదిరింపుతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. శుక్రవారం నాడు తెల్లవారుజామున  3 గంటలకు ఈ విమానం  ఢిల్లీ విమానాశ్రయంలో   ల్యాండ్ అయింది. 

 మాస్కో నుండి విమానం బయలుదేరింది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో  సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇవాళ తెల్లవారుజామున  విమానం ల్యాండ్ అయింది.  ఢిల్లీ పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

మాస్కో నుండి  ఎస్‌యూ 232  నెంబర్ విమానం  గురువారం నాడు బయలుదేరింది. ఈ విమనాంలో 386 మంది ప్రయాణీకులున్నారు. వీరిలో 16 మంది విమాన సిబ్బంది కూడా ఉన్నారు.  విమానంలో బాంబు ఉందనిగురువారం నాడు రాత్రి 11ఫ15 గంటలకు ఫోన్ వచ్చింది. బాంబు స్క్వాడ్ సిబ్బంది శుక్రవారం నాడు  తెల్లవారుజామున  రెండున్నర గంటలకు ఢిల్లీఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విమానం ఎయిర్ పోర్టులో ల్యాండ్ కాగానే  బాంబ్ స్క్వాడ్ సిబ్బంది విమానాన్ని తనిఖీ చేశారు. 
 

click me!