క్షణాల్లో ఘోరం జరిగిపోయింది.. నడిరోడ్డుపై భార్య, కూతురిని కాల్చి చంపి.. తననూ షూట్ చేసుకున్నాడు.. (వీడియో)

Published : Apr 28, 2022, 07:29 PM ISTUpdated : Apr 28, 2022, 07:36 PM IST
క్షణాల్లో ఘోరం జరిగిపోయింది.. నడిరోడ్డుపై భార్య, కూతురిని కాల్చి చంపి.. తననూ షూట్ చేసుకున్నాడు..  (వీడియో)

సారాంశం

బిహార్‌లో దారుణం జరిగింది. నడిరోడ్డుపై క్షణాల్లోనే ముగ్గురు విగతజీవులై పడిపోయారు. ఓ వ్యక్తి తన భార్య, ఆయన కూతురులను తుపాకీతో కాల్చి చంపారు. కాగా, ఆ తర్వాత తనను తాను కాల్చుకుని మరణించాడు.  

పాట్నా: సెకండ్ల వ్యవధిలో ఘోరం జరిగిపోయింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తన భార్య, కూతురు, అత్తను అటకాయించాడు. వెంటనే గన్‌ను చేతిలోకి తీసుకున్నాడు. ముందు తన కూతురిని షూట్ చేశాడు. ఆమె కుప్పకూలిపోయింది. ఆ తర్వాత భార్యను  ల్చాడు. ఆమె కూడా నేలపై పడిపోయింది. ఆ తర్వాత  గన్‌ను తన తలకే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ట్రిగ్గర్ నొక్కాడు. అతనూ కూలిపోయాడు. సెకండ్ల వ్యవధిలోనే ముగ్గురూ విగత జీవులై నేలకూలారు. మిగిలిన ఆ వృద్ధురాలు చుట్టూ పడి ఉన్న తన కూతురు, మనవరాలు, అల్లుడి మృతదేహాలు చూసి షాక్ తిన్నది. నెత్తి నోరు ఏకం చేసుకుంటూ ఏడ్చింది. ఇదంతా ఓ వీడియోలో రికార్డు అయింది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నది. 

దాడి చేసిన వ్యక్తిని రాజీవ్ కుమార్‌గా గుర్తించారు. ఈయన శశిప్రభ అక్కను పెళ్లి చేసుకున్నాడు. రాజీవ్ కుమార్‌కు శశిప్రభ అక్కలకు ఒక కూతురు జన్మించింది. ఆ తర్వాత సహజ కారణాలతోనే రాజీవ్ కుమార్ భార్య మరణించింది. ఆ తర్వాత రాజీవ్ కుమార్ శశిప్రభను పెళ్లి చేసుకున్నాడు. కానీ, వారిద్దరికీ పొసగలేదు. రాజీవ్ కుమార్, శశిప్రభల దాంపత్యం వివాదాలతోనే నలిగింది. దీంతో శశిప్రభ.. రాజీవ్ కుమార్‌కు విడాకులు ఇచ్చింది. రాజీవ్ కుమారు కుమార్తె సంస్కృతి కూడా తండ్రితో ఉండటానికి ఇష్టపడలేదు. తండ్రికి బదులు తన సవతి తల్లి అంటే శశిప్రభతోనే ఉండాలని నిర్ణయించుకుంది.

ఆ తర్వాత శశిప్రభ ఎయిర్ ఫోర్స్‌లో పని చేస్తున్న ఓ వ్యక్తిని శశిప్రభ పెళ్లి చేసుకున్నది. పాట్నాలోని హైప్రోఫైల్ పోలీసు కాలనీ ఏరియాలో ఆమె నివసిస్తున్నది. 

రాజీవ్ కుమార్.. శశిప్రభను, ఆయన కూతురు సంస్కృతిని వెనక్కి రావల్సిందిగా పలుమార్లు కోరాడు. ఆ తర్వాత వార్నింగ్‌లు ఇచ్చాడు. తన వద్దకు రాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయనీ హెచ్చరించాడు. కానీ, వారు తిరిగి రాలేదు. బెగుసరాయ్‌లో ఓ వివాహానికి హాజరై తాము అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్తుండగా ఆ ముగ్గురిని రాజీవ్ కుమార్ అడ్డుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

పోలీసులు రాజీవ్ కుమార్ కుటుంబ వివరాలను కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. బహుశా ఆయన మానసికంగా దుర్భలంగా ఉండి ఉండొచ్చని పోలీసులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు