160 ఏళ్ల వయసున్న అస్థిపంజరాలు.. అవి భారత వీరులవే.. వెలుగులోకి కీలక విషయాలు..

Published : Apr 28, 2022, 05:48 PM IST
 160 ఏళ్ల వయసున్న అస్థిపంజరాలు.. అవి భారత వీరులవే.. వెలుగులోకి కీలక విషయాలు..

సారాంశం

2014లో పంజాబ్‌ అజ్నాలాలోని బావిలో పెద్ద ఎత్తున మానవ అస్థిపంజరాలు వెలుగుచూశాయి. అయితే ఆ  ‌అస్థిపంజరాలు ఎవరికి చెందినవనేది మిస్టరీగానే మిగిలాయి. అయితే వాటిపై తాజా అధ్యయనం వాటికి సంబంధించిన కీలక విషయాలు వెలుగుచూశాయి.

2014లో పంజాబ్‌ అజ్నాలాలోని బావిలో పెద్ద ఎత్తున మానవ అస్థిపంజరాలు వెలుగుచూశాయి. అస్థిపంజరాల వయసు దాదాపు 160 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే ఆ  ‌అస్థిపంజరాలు ఎవరికి చెందినవనేది మిస్టరీగానే మిగిలాయి. అయితే వీటి గురించి రకరకాలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ అస్థిపంజరాలను ఇండియా- పాకిస్తాన్ విడిపోతున్న సమయంలో జరిగిన అల్లర్లలో చనిపోయిన ప్రజలకు చెందినవిగా కొందరు నమ్ముతారు. మరికొందరు మాత్రం అవి.. 1857 భారత స్వాతంత్ర్య పోరాట తిరుగుబాటు సమయంలో బ్రిటీష్ సైన్యం చేత చంపబడిన భారతీయ సైనికుల అస్థిపంజరాలు అని నమ్ముతారు. ఇందుకు వివిధ చారిత్రక ఆధారాలను కూడా చూపిస్తుంటారు. 

అయితే తాజాగా ఆ అస్థిపంజరాలు భారతీయ సైనికులవని హైదరాబాద్ కేంద్రంగా సీసీఎంబీ తెలిపింది. ఆ అస్థిపంజరాలు 1857లో బ్రిటీష్ వారి చేతిలో వీరమరణం పొందిన భార‌త సిపాయిల‌వని పేర్కొంది. అవి పంజాబ్‌కు గానీ, పాకిస్తాన్‌కు చెందినవి కావని చెప్పింది. అస్థిపంజరాలు బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ ప్రజలకు చెందినవని వారి విశ్లేషణలో అంచనా వేశారు.

ఇందుకు సంబంధించిన అధ్యయనం ఫ్రాంటియర్స్ ఇన్ జెనెటిక్స్ అనే సైంటిఫిక్ జర్నల్‌లో ఈ అధ్యయనం గురువారం ప్రచురించబడింది. పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ఆంత్రపాలజిస్ట్ డాక్టర్ జేఎస్ సెహ్రావత్, CCMB, లక్నోలోని బీర్బల్ సాహ్ని ఇనిస్టిట్యూట్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU)లు సంయుక్తంగా ఇందుకోసం పనిచేశాయి. అస్థిపంజరాల మూలాలను కనుగోవడానికి.. DNA, ఐసోటోప్ విశ్లేషణలను ఉపయోగించారు.

అస్థిపంజరాలు గంగా మైదాన ప్రాంతంలోని నివాసితులవని ప‌రిశోధ‌కుల‌ అధ్యయనంలో తేలింది. సీసీఎంబీ ప్రకటన ప్రకారం.. డీఎన్ఏ విశ్లేషణ కోసం 50 నమూనాలను, ఐసోటోప్ విశ్లేషణ కోసం 85 నమూనాలను ప‌రిశోధ‌కులు ఉపయోగించారు.

‘‘డీఎన్ఏ విశ్లేషణ ప్రజల పూర్వీకులను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఐసోటోప్ విశ్లేషణ ఆహారపు అలవాట్లను తెలియజేస్తుంది. రెండు పరిశోధన పద్ధతులు బావిలో లభించిన మానవ అస్థిపంజరాలు పంజాబ్‌లో గానీ, పాకిస్తాన్‌లో గానీ నివసించే వ్యక్తులవి కాదని సమర్థించాయి. బదులుగా.. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌లోని వ్యక్తులతో డీఎన్‌ఏ విశ్లేషణలు సరిపోలాయి" అని CCMB చీఫ్ సైంటిస్ట్ తంగరాజ్ చెప్పారు. తంగరాజ్ పరిశోధన బృందంలో భాగంగా ఉన్నారు. 

"DNA విశ్లేషణ ప్రజల పూర్వీకులను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది మరియు ఐసోటోప్ విశ్లేషణ ఆహారపు అలవాట్లపై వెలుగునిస్తుంది. రెండు పరిశోధనా పద్ధతులు బావిలో లభించిన మానవ అస్థిపంజరాలు పంజాబ్ లేదా పాకిస్తాన్‌లో నివసించే వ్యక్తులవి కాదని సమర్థించాయి. బదులుగా, యుపి, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్‌లోని వ్యక్తులతో DNA సన్నివేశాలు సరిపోలాయి" అని CCMB చీఫ్ సైంటిస్ట్ మరియు DNA ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కె తంగరాజ్ అన్నారు. డాక్టర్ తంగరాజ్ పరిశోధనా బృందంలో భాగం.

తమ పరిశోధన ఫలితాలు 26వ నేటివ్ బెంగాల్ ఇన్‌ఫ్యాన్ట్రీ‌కు చెందిన బెంగాల్, ఒడిశా, బీహార్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వ్య‌క్తులతో కూడిన చారిత్ర‌క ఆధారాల‌కు అనుగుణంగా ఉన్నాయ‌ని డాక్టర్ సెహ్రావత్ చెప్పారు. ఇక, ‘‘చారిత్ర ఆధారాల ప్రకారం.. ఈ బెటాలియన్‌కు చెందిన సైనికులు పాకిస్తాన్‌లోని మియాన్-మీర్‌లో నియమించబడ్డారు. తిరుగుబాటులో భాగంగా వారు బ్రిటిష్ అధికారులను చంపారు. వారిని అజ్నాలా సమీపంలో బ్రిటిష్ సైన్యం పట్టుకుని ఉరితీసింది’’ సీసీఎంబీ ప్రకటనలో పేర్కొంది.  

DNA అధ్యయనంలో కీలక పాత్ర పోషించిన BHUకు చెందిన జువాలజీ విభాగం ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే మాట్లాడుతూ.. ఈ అధ్యయనంలో కనుగొన్న ఫలితాలు భారతదేశ ప్రథమ స్వాతంత్య్ర పోరాటంలో కీర్తించని వీరుల చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని జోడిస్తుందని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్