బాయ్ ఫ్రెండ్ తో పారిపోయిన సోదరి...కాల్చి చంపిన సోదరుడు..!

Published : Jun 22, 2021, 01:44 PM IST
బాయ్ ఫ్రెండ్ తో పారిపోయిన సోదరి...కాల్చి చంపిన సోదరుడు..!

సారాంశం

బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తిరిగి ఇంటికి రావడంతో ఆమె కుటుంబం పోలీసులకు సమాచారం ఇచ్చారు. 


తన సోదరి.. ఇంట్లో వారిని కాదని.. ప్రియుడితో లేచిపోయిందని.. ఓ వ్యక్తి పగ పెంచుకున్నాడు.  ఈ క్రమంలో... దారుణంగా కాల్చి చంపేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సర్దన పోలీసుస్టేషన్ పరిధిలోని చుర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అంజలి అనే 16 ఏళ్ల బాలిక తన ప్రియుడైన గౌరవ్ తో కలిి పారిపోయింది. దీంతో బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తిరిగి ఇంటికి రావడంతో ఆమె కుటుంబం పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ప్రియుడితో పారిపోయి తిరిగివచ్చిన అంజలి ఇంట్లో పనిచేస్తుండగా ఆమె సోదరుడు శేఖర్ నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం శేఖర్ ఇంటి నుంచి పారిపోయాడు. అంజలి గౌరవ్ ను వివాహం చేసుకోవాలని అనుకున్నా, వీరి బంధానికి సోదరుడు అడ్డుగా నిలిచాడు. బాలిక మామ ఇచ్చిన ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు