కరోనా థర్డ్‌వేవ్‌పై సిద్దం కావాలి:శ్వేతపత్రం విడుదల చేసిన రాహుల్

By narsimha lodeFirst Published Jun 22, 2021, 11:51 AM IST
Highlights

 కరోనాను ఎదుర్కొనేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై  శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం నాడు విడుదల చేశారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా సమావేశం నిర్వహించారు. 

న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై  శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం నాడు విడుదల చేశారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా సమావేశం నిర్వహించారు.  

వ్యాక్సినేషన్ ను వేగంగా పూర్తి చేయాలని ఆయన కోరారు. కరోనా మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.సెకండ్ వేవ్ హెచ్చరికలను కేంద్రం పట్టించుకోలేదని  ఆయన విమర్శించారు. కనీసం థర్డ్ వేవ్ కోసమైనా కేంద్రం సిద్దం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  కరోనా  మ్యూటేషన్లు వృద్ది చెందుతూ ప్రజలపై ప్రభావం చూపిస్తున్నాయన్నారు. ఫస్ట్, సెకండ్ వేవ్‌ల విషయంలో కేంద్రం సరిగా  సిద్దం కాలేదని ఆయన విమర్శించారు.  

 కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు వీలుగా  శ్వేతపత్రాన్ని విడుదల చేశారు రాహుల్ గాంధీ, కరోనా వ్యాక్సిన్ విషయంలో  ప్రభుత్వ విధానాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కరోనా థర్డ్ వేవ్ అనివార్యమని నిఫుణులు హెచ్చరించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు  శ్వేతపత్రంలో కొన్ని అంశాలను పొందుపర్చినట్టుగా ఆయన తెలిపారు. నిపుణులతో చర్చించి  ఈ అంశాలను శ్వేతపత్రంలో చేర్చామన్నారు.దేశంలో వంద శాతం వ్యాక్సినేషన్ చేయాలని ఆయన కేంద్రానికి సూచించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. 


 

click me!