దారుణం : స్నేహితుడి తలనరికి.. సీఎం ఫాంహౌజ్ దగ్గర్లో పూడ్చిపెట్టారు.. !

Published : Jun 22, 2021, 11:49 AM IST
దారుణం : స్నేహితుడి తలనరికి.. సీఎం ఫాంహౌజ్ దగ్గర్లో పూడ్చిపెట్టారు.. !

సారాంశం

చండీగఢ్ లో దారుణం జరిగింది. ముగ్గురు వ్యక్తులు కలిసి మరో స్నేహితుడిని అత్యంత దారుణంగా చంపి హతమార్చారు. తల నరికి, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫాం హౌస్ సమీపంలోనే శవాన్ని పూడ్చి పెట్టారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

చండీగఢ్ లో దారుణం జరిగింది. ముగ్గురు వ్యక్తులు కలిసి మరో స్నేహితుడిని అత్యంత దారుణంగా చంపి హతమార్చారు. తల నరికి, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫాం హౌస్ సమీపంలోనే శవాన్ని పూడ్చి పెట్టారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

సత్నాం సింగ్, దేశ్ రాజ్, జాగీర్ సింగ్ అనే ముగ్గురు స్నేహితులు.. సుచాసింగ్ అనే మరో స్నేహితుడిని మద్యం తాగుదాం అంటూ పిలిచారు. సీఎం ఫాంహౌస్ సమీపంలోనే వీళ్లంతా మద్యం తాగడం ప్రారంభించారు. 

అయితే ఈ స్నేహితుల్లో ఒకరికిి సుచాసింగ్ రూ.60వేలు బాకీ ఉన్నాడు. అవి ఎప్పుడిస్తావ్.. అంటూ తాగిన తరువాత ముగ్గురు స్నేహితులు సుచాను నిలదీశారు. ప్రస్తుతం కరోనా కష్టాల్లో ఉన్న సుచా.. ఇంకా సమయం కావాలన అడిగాడు. ఈ క్రమంలో వీరి మధ్య వివాదం చెలరేగింది. 

గొడవ పెరగడంతో ముగ్గురు మిత్రులూ కలిసి సుచా మీద దాడి చేశారు. కత్తితో అతని తల నరికారు. ఆ శవాన్ని దగ్గర్లోనే పూడ్చి పెట్టి వెళ్లిపోయారు. ఈ దారుణం ఈ నెల 12న జరిగింది. సుచా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అదే సమయంలో సుచా మృతదేహాన్ని పాతి పెట్టిన చోట కాళ్లు బైటికి కనిపించడంతో భయపడిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు తల లేని మృతదేహం కనిపించింది. 

మొండెం మీదున్న దుస్తులను బట్టి అది సుచా మృతదేహమని గుర్తించారు. దర్యాప్తులో ఆ రోజు సుచాను కలిసిన ముగ్గురిని పట్టుకునే ప్రయత్నం చేశారు. 
సత్నాం సింగ్, దేశ్ రాజ్‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, జాగీర్ సింగ్ జాగీర్ పరారీలో ఉన్నాడు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu