100మంది మహిళలు స్నానం చేస్తుండగా వీడియో... యువకుడి అరెస్ట్ !

Published : May 01, 2021, 09:14 AM IST
100మంది మహిళలు స్నానం చేస్తుండగా వీడియో... యువకుడి అరెస్ట్ !

సారాంశం

తమిళనాడులోని చెన్నైలో దారుణం జరిగింది. ఓ యువకుడు స్నానం చేస్తున్న మహిళల వీడియోలను తన సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. చివరికి కటకటాలపాలయ్యాడు.  

తమిళనాడులోని చెన్నైలో దారుణం జరిగింది. ఓ యువకుడు స్నానం చేస్తున్న మహిళల వీడియోలను తన సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. చివరికి కటకటాలపాలయ్యాడు.

వివరాల్లోకివెడితే కన్నియకుమారి జిల్ల కులశేఖరం ప్రాంతంలో ఓ మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కులశేఖరం పట్టణంలో ఓ 50యేళ్ల మహిళ తన ఇంట్లోని బాత్రూంలో స్నానం పూర్తి చేసి బైటికి వచ్చింది.

ఆ సమయంలో బాత్రూంలోని చిన్న రంధ్రంలో ఏదో వస్తువు ఉన్నట్టు అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూసింది. గోడకు అవతలి వైపు ఓ యువకుడు ఆ రంధ్రంలో కెమెరాలాంటి వస్తువు పెట్టి తన సెల్ ఫోన్ లో ఆమె స్నానం చేసిందంతా రికార్డ్ చేశాడు. అది గమనించి ఆ మహిళ షాక్ అయ్యింది. 

ఆ వెంటనే గట్టిగా కేకలు వేసి చుట్టుపక్కల వారిని పోగెయ్యడంతో విషయం తెలుసుకున్నవారు.. ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు..

ఆ తరువాత యువకుడి మీద జరిపిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. అతను ఆ మహిళదే కాదు ఆ ప్రాంతంలోని దాదాపు 100మంది మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసినట్లు తెలిసింది. 

అయితే ఇది మహిళలకు సంబంధించిన వ్యవహారం కావడంతో... పోలీసులు నిందితుడికి సంబంధించిన వివరాలు, వీడియో దృశ్యాల గురించిన విషయాలు గోప్యంగా ఉంచారు.  
 

PREV
click me!

Recommended Stories

Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?
Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు