గుజరాత్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: 18 మంది కోవిడ్ రోగుల దుర్మరణం

Published : May 01, 2021, 06:43 AM ISTUpdated : May 01, 2021, 08:06 AM IST
గుజరాత్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: 18 మంది కోవిడ్ రోగుల దుర్మరణం

సారాంశం

గుజరాత్ లోని భరూచలో గల కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో 18 మంది కోవిడ్ రోగులు మృత్యువాత పడ్డారు మరో 50మంది సురక్షితంగా బయటపడ్డారు.

భరూచ: గుజురాత్ లోని భురూచలో గల ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జామున సంభవించిన ఈ అగ్ని ప్రమాదంలో 18 మంది కరోనా రోగులు మరణించారు ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో 50 మంది రోగులుచికిత్స పొందుతున్నారు. 

మిగతావారిని స్థానికులు, ఫైర్ ఫైటర్స్ కాపాడారు. కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులు మృతి చెందారని, విపరీతమైన పొగ రావడంతో వారు మరణించినట్లు భరూచ ఎస్పీ రాజేంద్రసన్హ్ చుడసామ చెప్పారు. 

నాలుగు అంతస్థుల ఈ కోవిడ్ ఆస్పత్రి భరూచ - జంజూబసర్ జాతీయ రహదారిపై ఉంటుంది. దీన్ని ఓ ట్రస్టు నడిపిస్తోంది. గంటలో మంటలను ఆర్పేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇతర రోగులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు 

ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఏమిటనేది తెలియడం లేదు. ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !