రూ.3000 కోసం దారుణం.. పట్టపగలు నడిరోడ్డుపై వెంటాడి.. వేటాడి.. చివరికి.. 

Published : Aug 02, 2023, 07:58 PM ISTUpdated : Aug 02, 2023, 08:00 PM IST
రూ.3000 కోసం దారుణం.. పట్టపగలు నడిరోడ్డుపై వెంటాడి.. వేటాడి.. చివరికి.. 

సారాంశం

దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రూ. 3,000 అప్పుగా తీసుకున్న వ్యక్తిని అప్పు ఇచ్చిన వ్యక్తి అత్యంత దారుణంగా పొడిచి చంపాడు. రోడ్డుపై జరిగిన ఈ దారుణాన్ని ఎవరూ నిలువరించలేకపోయారు.  

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఒక వ్యక్తి మరో వ్యక్తిని  కత్తితో  పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆ దారుణాన్ని అక్కడి వారు చూస్తూ ఉండిపోయారు తప్ప.. ఎవరూ నిలువరించలేకపోయారు. చివరికి కొందరూ వ్యక్తులు ఆ నిందితుడిపై కర్రలతో దాడి చేసి.. పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. నిందితుడిని విచారించిన అనంతరం కేసుకు సంబంధించిన సమాచారం ఇస్తూ.. కేవలం రూ.3000 కోసం ఆ యువకుడిని బహిరంగంగా పొడిచి చంపానని  పోలీసులకు వెల్లడించాడు. మృతుడిని యూసుఫ్ అలీగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షారుక్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఇదీ సంగతి.. 

ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలోని సంగం విహార్‌కు చెందిన యూసఫ్ అలీ(21)కి షారుఖ్ అనే వ్యక్తి రూ.3,000 లను అప్పుగా ఇచ్చాడు. అయితే.. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడగగా.. సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట యూసఫ్‌కు షారుఖ్‌ వార్నింగ్ ఇచ్చాడు. అయినా డబ్బులు చెల్లించకుండా మొకం చాటేశాడు. దీంతో ఆగ్రహించిన షారుక్ బుధవారం ఉదయం ఓ షాపు ఉన్న యూసుఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఆకస్మిక దాడిలో యూసుఫ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకుండా పోయింది.

చుట్టుపక్కల ఉన్న వారు చూస్తునే ఉన్నారు. తప్ప .. ఆ దారుణాన్ని ఆపలేకపోయారు. చివరికి కొందరూ వ్యక్తులు ధైర్యం చేసి హంతకుడి కర్రలతో కొట్టి అతని చేతిలోని కత్తిని లాక్కున్నారు. జనం కొట్టడంతో నిందితుడు కూడా స్పృహతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ దారుణం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు.. యూసుఫ్ అలీని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu