ఘరానా మోసం.. ఉద్యోగం చేయకున్నా పదేళ్లుగా భార్య పేరిట జీతం.. కంపెనీకి కోట్ల రూపాయల నష్టం.. 

Published : Aug 01, 2023, 05:31 AM IST
ఘరానా మోసం.. ఉద్యోగం చేయకున్నా పదేళ్లుగా భార్య పేరిట జీతం.. కంపెనీకి కోట్ల  రూపాయల నష్టం.. 

సారాంశం

ఒక ప్రైవేట్ రిక్రూట్‌మెంట్ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి మోసానికి పాల్పడ్డాడు. తన భార్య  తన కంపెనీలో పని చేయకున్నా.. ఆమె పేరిట 10 ఏండ్లుగా జీతం పోందుతున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది.

ఓ ప్రైవేట్ రిక్రూట్‌మెంట్ కంపెనీలో పనిచేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఉపాధి కల్పించిన తన కంపెనీకే సున్నం పెట్టాడు. తన కంపెనీలో తన భార్య ఉద్యోగం చేయకున్నా.. ఆమె పేరిట జీతం పొందాడు. నెలనో.. రెండు నెలలో కాదు. ఏకంగా 10 ఏళ్లపాటు కంపెనీ మోసం చేసి.. అక్రమంగా జీతం పొందాడు. కంపెనీకి కోట్ల రూపాయాల కుచ్చుటోపి పెట్టాడు. ఈ షాకింగ్ కేసు ఢిల్లీలో వెలుగు చూసింది.

ఈ కేసు వివిధ కంపెనీలకు సిబ్బంది, నియామక సేవలను అందించే మ్యాన్‌పవర్‌గ్రూప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో చోటుచేసుకుంది. ఈ పరిణామంతో కంపెనీకి రూ. 4 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. గతేడాది డిసెంబరులో రికార్డులు తారుమారు అయినట్లు ఢిల్లీకి చెందిన కంపెనీ తెలియగానే అంతర్గత విచారణ చేపట్టగా నేరం బయటపడింది.దీంతో గత వారం సదరు వ్యక్తిపై  ఢిల్లీ పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అసలేం జరిగింది ?

ఈ ఘటన మ్యాన్‌పవర్‌గ్రూప్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించినది. ఇది వివిధ కంపెనీలకు సిబ్బంది, నియామక సేవలను అందిస్తుంది. మ్యాన్‌పవర్‌గ్రూప్ పోలీసులకు దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. రాధాబల్లవ నాథ్ 2008లో కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్)గా పని చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత మేనేజర్ (ఫైనాన్స్)గా పదోన్నతి పొందాడు. తన జీతంతో సంత్రుప్తి చెందని రాధా వల్లవ నాథ్ తన భార్య పేరిట కూడా ఆదాయం పొందాలని భావించారు.

ఈ క్రమంలో కంపెనీని మోసం చేయాలని ప్లాన్ చేశాడు. కంపెనీ డేటా ఆధారంగా మోసానికి పాల్పడ్డాడు. నెలనెల పేరోల్ లిస్టులో తన భార్య పేరును చేర్చేవాడు. జీతం పొందిన తర్వాత  ఆమె పేరును తొలగించేవాడు. ఈ డేటాను యాక్సెస్ చేయడానికి ఇది ముగ్గురు అధికారులను-డైరెక్టర్ (HR), చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO), నాథ్-లను మాత్రమే అధికారం ఉండేది. కింది స్థాయి ఉద్యోగుల తయారు చేసిన జాబితా తుది ఆమోదం కోసం చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ (సిహెచ్‌ఆర్‌ఓ)కి పంపారు. CHRO దానిని ఆమోదించి, దానిని డైరెక్టర్ (HR)కి తిరిగి పంపుతుంది. అతను దానిని తుది చెల్లింపు రిజిస్టర్‌గా నాథ్‌కు పంపుతారు. జీతం విడుదల కోసం చివరి పే రిజిస్టర్‌ను బ్యాంకుకు పంపే బాధ్యత నాథ్‌పై ఉంది.

4 కోట్ల మేర బూరిడీ

ఈ క్రమంలో రాధాబల్లవ నాథ్ రిజిస్టర్‌ను తారుమారు చేసి బ్యాంకుకు పంపే ముందు తన భార్య పేరును అందులో ఉంచేవాడని కంపెనీ ఆరోపించింది. రాధాబల్లవ నాథ్‌ను డిసెంబర్ 11, 2022న సస్పెండ్ చేశారు. డిసెంబర్ 8, 2022న జరిగిన టీమ్ మీటింగ్‌లో బయటపడిన వైరుధ్యంపై విచారణ కోసం మ్యాన్‌పవర్‌గ్రూప్ అంతర్గత కమిటీని ఏర్పాటు చేసిందని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. 2012 నుంచి తన భార్య బ్యాంకు ఖాతాలోకి రూ.3.6 కోట్లను అక్రమంగా బదిలీ చేసినట్లు రాధాబల్లవ నాథ్ అంగీకరించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా తన జీతం పెంచి రూ.60 లక్షలను తన ఖాతాకు బదిలీ చేశానని, దీంతో కంపెనీకి మొత్తం రూ.4.2 కోట్ల నష్టం వాటిల్లిందని నాథ్ అంగీకరించాడు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌