ఏడు నెలల చిన్నారి కడుపులో 2 కిలోల పిండం.. 4 గంటల పాటు శస్త్ర చికిత్స..

Published : Aug 01, 2023, 02:51 AM IST
ఏడు నెలల చిన్నారి కడుపులో 2 కిలోల పిండం.. 4 గంటల పాటు శస్త్ర చికిత్స..

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడు నెలల చిన్నారి కడుపులో నుంచి 2 కిలోల పిండాన్ని బయటకు తీశారు. వైద్యులు 4 గంటల పాటు ఆపరేషన్ చేసి పిండాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం చిన్నారి క్షేమంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ఆపరేషన్ సమయంలో చిన్నారి బరువు 8 కిలోలు.

ఉత్తరప్రదేశ్ లో ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.  ఏడు నెలల చిన్నారి కడుపులో పెరుగుతున్న బిడ్డ(పిండం)ని బయటకు తీయడంలో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు విజయం సాధించారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఆపరేషన్ అనంతరం చిన్నారి కడుపులో నుంచి రెండు కిలోల బరువున్న పిండాన్ని బయటకు తీశారు. చిన్నారి కూడా పూర్తిగా సురక్షితంగా ఉన్నది. ప్రస్తుతం చిన్నారి  వైద్యుల పర్యవేక్షణలో ఉంది. తల్లి కడుపులో పెరుగుతున్న పిండం లోపల మరో పిండం ఏర్పడడం వల్ల మినహాయింపుగా ఇలాంటి కేసులు తెరపైకి వస్తాయని వైద్యులు చెబుతున్నారు. 

చిన్నారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ డి.కుమార్ మాట్లాడుతూ.. ఆ చిన్నారి ప్రతాప్‌గఢ్‌లోని కుంట నివాసి అని తెలిపారు. చిన్నారి తరుచు కడుపునొప్పితో బాధ పడేదని అన్నారు. దీంతో బంధువులు ఓపీడీకి తీసుకొచ్చారు. చిన్నారి కడుపు బాగా ఉబ్బిపోయింది. చిన్నారి పొట్టకు సీటీ స్కాన్ చేశారు. పరీక్షలో పిండం గుర్తించిన వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించామని అన్నారు. వైద్య భాషలో ఫీటస్ ఇన్ ఫీటూ అంటారు.

దేశంలో ఇప్పటివరకు దాదాపు 200 కేసులు నమోదయ్యాయని తెలిపారు.  కొన్ని సందర్భాల్లో తల్లి కడుపులో పెరుగుతున్న పిండం లోపల మరొక పిండం తయారవుతుంది. ఈ చిన్నారి విషయంలో కూడా అదే జరిగిందని తెలిపారు. ఈ చిన్నారి  శ్వాస తీసుకోవడంలో కూడా చాలా ఇబ్బంది పడింది. బిడ్డకు ఆకలి కూడా అనిపించలేదు.  బరువు కూడా  క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇబ్బంది పడిన తండ్రి కొన్ని రోజుల క్రితం చిన్నారిని లక్నోలోని SGPGIకి తీసుకెళ్లాడు. కానీ డబ్బు లేకపోవడంతో చిన్నారికి అక్కడ వైద్యం చేయించలేకపోయాడు.
తొలుత చిన్నారికి కడుపులో కణితి ఉందని వైద్యులు భావించారు.

ఇరుగుపొరుగు వారి సూచన మేరకు తండ్రి ప్రయాగ్‌రాజ్‌లోని సరోజినీ నాయుడు పీడియాట్రిక్ హాస్పిటల్‌లో చూపించాడు. చిన్నారి కడుపులో కణితిని ఉందని వైద్యులు భావించారు. అయితే సీటీ స్కాన్‌ చేయగా.. చిన్నారి కడుపులో పిండం ఉందని గుర్తించారు. శుక్రవారం డాక్టర్ డి.కుమార్ నేతృత్వంలో డాక్టర్ నీతూ, డాక్టర్ అరవింద్ యాదవ్ బృందం సుమారు నాలుగు గంటలపాటు ఆపరేషన్ చేసి పిండాన్ని వెలికితీశారు.  

7 నెలల క్రితమే మను తల్లి స్వరూపాణి నెహ్రూ ఆసుపత్రిలో డెలివరీ అయినట్లు డాక్టర్ డి.కుమార్ తెలిపారు. అదే సమయంలో పిల్లల కడుపు ఉబ్బిపోయింది, కానీ ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. ప్రసవం అయిన 9 రోజులకే తల్లి చనిపోయింది. ఇతర కుటుంబ సభ్యులు 7 నెలలుగా బిడ్డను చూసుకుంటున్నారు. ఇలాంటి కేసులు చాలా అరుదు అని గైనకాలజిస్ట్ డాక్టర్ కీర్తికా అగర్వాల్ తెలిపారు. నిజానికి ఇందులో బిడ్డ కడుపులోనే బిడ్డ ఏర్పడుతోందనీ, తల్లి కడుపులో ఒకటి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి అసాధారణ పరిస్థితి తలెత్తె ప్రమాదముందని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !