మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి రూ. 12 లక్షల విలువైన ఆభరణాలను చెత్తడబ్బాలో దాచిపెట్టాడు. మున్సిపాలిటీ వాళ్లు చెత్తతో పాటు నగలనూ తీసుకెళ్లారు.
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ వ్యక్తి పొరపాటున తమ నగల పెట్టెను చెత్తబుట్టలో పడేశాడు. అందులో రూ. 12 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఆ తరువాత తప్పు తెలుసుకుని నగల కోసం వెతికారు. అప్పటికే ఇంటి దగ్గరినుంచి చెత్త తీసుకెళ్లడంతో డంపింగ్ యార్డ్ కు వెళ్లారు. అక్కడున్న టన్నుల కొద్దీ చెత్తాచెదారం మధ్య రీసైక్లింగ్ ప్లాంట్‌లో గంటల తరబడి వెతికిన తరువాత వారి శ్రమ ఫలించింది.
ప్రమోద్‌కుమార్ అనే వ్యక్తి సుమారు రూ.12 లక్షల విలువైన విలువైన ఆభరణాలను ఇంట్లోని చెత్తతో పాటు ప్రమాదవశాత్తు పారేసాడు. ఎలా జరిగిందంటే.. ప్రమోద్ కుటుంబంతో కలిసి భోపాల్ వెళ్లాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు. దీంతో ఎవరైనా దొంగలు ఎత్తుకెడతారని ముందు జాగ్రత్తగా.. ఆభరణాల పెట్టెను డస్ట్‌బిన్‌లో దాచిపెట్టాడు. భోపాల్ వెళ్లిపోయాడు.
టీనేజ్ అమ్మాయిలు లైంగిక కోరికలను అదుపులో పెట్టుకోవాలి.. : కలకత్తా హైకోర్టు
అయితే, వారు ఊరికెళ్ళిన సమయంలో స్థానిక పౌరసరఫరాల సంస్థకు చెందిన చెత్త సేకరణ వాహనం ఆ డస్ట్ బిన్ లోని చెత్తతో పాటు అతని ఆభరణాల పెట్టెను కూడా తీసుకుపోయినట్లు గుర్తించాడు. ప్రమోద్ కుమార్ వెంటనే చెత్త నిర్వహణ సంస్థకు సమాచారం అందించాడు. వారు చెత్త సేకరణ వాహనం వెళ్ల మార్గాన్ని గుర్తించి ఆ ప్రాంతంలో వెతకడం ప్రారంభించారు.
కార్మికులలో ఒకరైన ముఖేష్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, "చాలా గంటలపాటు, సుమారు రెండు డజన్ల మంది ఉద్యోగుల బృందం చెత్త మధ్య ఆభరణాల కోసం శ్రద్ధగా వెతికిన తరువాత ఆ ఆభరణాలను విజయవంతంగా కనిపెట్టాం" అని తెలిపారు. నగలు దొరికిన డంపింగ్ యార్డుకు చెత్తను తరలించారు.