భార్య మీద కోపం.. ఆమె వివరాలు మ్యాట్రిమోనీలో పెట్టి..!

Published : Oct 21, 2021, 12:02 PM IST
భార్య మీద కోపం.. ఆమె వివరాలు మ్యాట్రిమోనీలో పెట్టి..!

సారాంశం

విడాకుల వ్యవహారం ఇంకా కోర్టులో ఉండగానే అతను.. భార్యపై వక్ర బుద్ధి చూపించాడు. భార్యకు తెలీకుండా ఆమె వివరాలను మ్యాట్రిమోనీలో పెట్టాడు.

వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లి తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.  దీంతో.. విడిపోవాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. కోర్టును కూడా ఆశ్రయించారు. విడాకుల వ్యవహారం ఇంకా కోర్టులో ఉండగానే అతను.. భార్యపై వక్ర బుద్ధి చూపించాడు. భార్యకు తెలీకుండా ఆమె వివరాలను మ్యాట్రిమోనీలో పెట్టాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: భర్త హత్యకేసులో ఐదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న భార్య, సినిమాటిక్ గా ప్రత్యక్షమవ్వడంతో షాక్.. అసలేం జరిగిందంటే..

తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌కి చెందిన యువతి(32)కి వెళ్లియూర్‌ పంచాయతీ అధ్యక్షుడు సురేష్‌బాబు కుమారుడు ఓంకుమార్‌(34)తో 2016లో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.

Also Read: చెన్నై ‘లవ్ స్టోరీ’.. వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని యువతిని తీసుకెళ్లి చంపే ప్రయత్నం... !!

విడాకులు కావాలని పూందమల్లి కోర్టులో ఓంకుమార్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో విచారణ సాగుతోంది. రెండు వారాల క్రితం ప్రముఖ మ్యాట్రిమొనిలో వరుడు కావాలని భార్య వివరాలను ఉంచాడు. ఆసక్తి ఉన్న వారు యువతి తండ్రిని సంప్రదించాలని పేర్కొన్నాడు. యువతి తండ్రికి ఫోన్‌కాల్స్‌ రావడంతో ఆయన తిరువళ్లూరు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో ఓంకుమార్‌ విషయం తెలిసింది. పోలీసులు బుధవారం ఓంకుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

PREV
click me!

Recommended Stories

India Map Sri Lanka : ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
Illegal Liquor: సీజ్ చేసిన మద్యాన్నిగుజరాత్ పోలీస్ లు ఏం చేస్తున్నారో చూడండి | Asianet News Telugu