భార్యను చంపాలని ప్లాన్ వేశాడు.. కానీ, అత్త హతమైంది.. పరారీలో నిందితుడు

Published : Oct 11, 2022, 01:58 PM ISTUpdated : Oct 11, 2022, 02:04 PM IST
భార్యను చంపాలని ప్లాన్ వేశాడు.. కానీ, అత్త హతమైంది.. పరారీలో నిందితుడు

సారాంశం

మధ్యప్రదేశ్‌లో ఓ తాగుబోతు కట్టుకున్న భార్యను కడతేర్చాలని ప్లాన్ వేశాడు. కానీ, ఆ ప్లాన్ బెడిసికొట్టింది. భార్య తల్లి బలైంది. డోర్‌కు కరెంట్ వైర్ చేర్చిన నిందితుడు.. అత్త స్పాట్‌లోనే మరణించడంతో పరారయ్యాడు.  

భోపాల్: భార్య భర్తల మధ్య గొడవలు సహజం. భర్త తాగుబోతు అయితే.. గొడవలు నిత్యం జరుగుతాయి. మద్యం చిచ్చు అసలే మానదు. ఈ వ్యసనం భార్య భర్తలను విడదీసే వరకు వెళ్లుతుంది. విడిపోవడం కాదు కదా.. ఏకంగా భార్యను హతమార్చాలనే మధ్యప్రదేశ్‌లోని ఓ భర్త ప్లాన్ వేశాడు. కరెంట్ షాక్‌తో భార్యను చంపేయాలని అనుకున్నాడు. అందుకు ప్లాన్ కూడా వేశాడు. కానీ, భార్య కాకుండా.. భార్య తల్లి ఆ ప్లాన్‌కు బలైంది. ఈ ఘటన బేతుల్ జిల్లా కొత్వాలీ పోలీసు స్టేషన్ పరిధిలోని సైఖేదా గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. 

ఆ వ్యక్తి ఎప్పుడూ మద్యం తాగేవాడని పోలీసు అధికారి తెలిపాడు. ఓ రోజు ఆ వ్యక్తికి, ఆయన భార్యకు మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవ తర్వాత ఆయన భార్య.. తల్లిగారింటికి వెళ్లింది. ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోవడంపై భర్త తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. అత్తవాళ్ల ఇంటికి ఆయన కూడా వెళ్లాడు.

Also Read: 36యేళ్లుగా కూతుర్ని గదిలో గొలుసుతో బంధించిన తండ్రి, మలమూత్రవిసర్జన అక్కడే, తలుపు కిందినుంచే భోజనం..

అక్కడే తన భార్యను చంపేయాలని అనుకున్నాడు. అత్తవారి ఇంటికి మెయిన్ డోర్ ఐరన్‌తో చేయించింది ఉన్నది. ఈ ఐరన్ డోర్‌కు ఎలక్ట్రిక్ వైర్ ఆనించి ఉంచాడు. ఆ ఐరన్ డోర్‌ను తన భార్య ముట్టుకుని కరెంట్ షాక్‌తో మరణిస్తుందని ఆ తాగుబోతు భావించాడు. కానీ, భార్య కంటే ముందుగానే అత్త ఆ డోర్‌ను పట్టుకుంది. దీంతో ఆమె స్పాట్‌లోనే మరణించింది.

ఈ ఘటన జరగ్గానే నిందితుడు స్పాట్ నుంచి పారిపోయాడు. అతడిని గాలిస్తున్నామని పోలీసులు వివరించారు. నిందితుడపై కేసు పెట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శనివారం ఏం జరగనుంది.? లాక్‌డౌన్‌ త‌ర‌హా నిబంధ‌న‌లు ఎందుకు విధించారు.?
Indian Railways: రైళ్లలో పిల్లలకు 50 శాతం టికెట్ ఛార్జీ తగ్గింపు.. ఏ వయసు వరకు ఇస్తారో తెలుసా?