ఫుట్ బాల్ సాక్స్ ఆర్డర్ చేస్తే.. బ్రా వచ్చింది.. షాక్ అయిన అతను చేసిన పని....

By AN TeluguFirst Published Oct 20, 2021, 9:01 AM IST
Highlights

ఆన్‌లైన్ షాపింగ్‌కు ఇది ఒక ఉదాహరణ,  @LowKashWala అనే యూజర్ నేమ్ గల ఒక ట్విట్టర్ యూజర్ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో తన ఆశ్చర్యాన్ని పంచుకున్నాడు. కారణం ఏంటంటే.. అతను పుట్ బాల్ సాక్సులు కొనాలనుకున్నాడు. దీనికోసం మింత్రా సైట్ లో ఆర్డర్ పెట్టాడు. తన ఆర్డర్ కోసం ఆసక్తిగా ఎదురు చూశాడు. చెప్పిన తేదీ ప్రకారం ఆర్డర్ వచ్చింది. 

ఆన్ లైన్ షాపింగ్ లో కొన్నిసార్లు పొరపాట్లు మామూలే.. ఆపిల్ ఫోన్ ఆర్డర్ ఇస్తే ఆపిల్స్ వచ్చిన సంఘటనలు, అసలు వస్తువులకు బదులు రాళ్లు, లేదా వేరే ఇతర తక్కువ రకం వస్తువులు ఉండడం అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది. అలాంటి ఘటనే ఒకటి LowKashWalaకు ఎదురయ్యింది. 

ఆన్‌లైన్ షాపింగ్‌కు ఇది ఒక ఉదాహరణ,  @LowKashWala అనే యూజర్ నేమ్ గల ఒక ట్విట్టర్ యూజర్ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో తన ఆశ్చర్యాన్ని పంచుకున్నాడు. కారణం ఏంటంటే.. అతను పుట్ బాల్ సాక్సులు కొనాలనుకున్నాడు. దీనికోసం మింత్రా సైట్ లో ఆర్డర్ పెట్టాడు. తన ఆర్డర్ కోసం ఆసక్తిగా ఎదురు చూశాడు. చెప్పిన తేదీ ప్రకారం ఆర్డర్ వచ్చింది. 

అయితే అప్పుడే అసలు ట్విస్ట్ మొదలయ్యింది. వచ్చిన ఆర్డర్ ను ఎంతో ఉత్సాహంగా తెరిచి చూసిన లోకేష్ వాలాకు షాక్ తగిలింది. తను ఆర్డర్ చేసిన football socksకు బదులు అందులో మహిళలు ధరించే బ్రా ఉంది. ముందు అది తన ఆర్డర్ కాదేమో అనుకున్నాడు. ఆర్డర్ మిస్ ప్లేస్ అయ్యిందేమో అనుకున్నాడు. 

కానీ ప్యాక్ మీద చెక్ చేయగా, అడ్రస్, ఆర్డర్ తనదే ఉంది. దీంతో షాక్ అయ్యి...వెంటనే అతను రీఫండ్, ఎక్స్ఛేంజ్ కోసం ప్రశ్నించగా.. అతనికి ‘ప్రొడక్ట్ నాట్ రిటర్న్’ అంటూ మెసేజ్ వచ్చింది. దీంతో చిరాకొచ్చిన లోకేష్ ఈ విషయాన్నంతా ట్విట్టర్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. 

దీనికి అతను వ్యంగ్య వ్యాఖ్యానాన్ని కూడా జోడించాడు.. "ఫుట్‌బాల్ సాక్స్ ఆర్డర్ చేశాను. triumph bra వచ్చింది. ఇక @myntra స్పందన ఎలా ఉందో తెలుసా?.. వాళ్లు ‘సారీ, దాన్ని మేము రీప్లేస్ చేయలేం’ అంటున్నారు. కాబట్టి నేను ఫుట్‌బాల్ ఆటలకు 34 సిసి బ్రా ధరించి ఆడబోతున్నాను. దీన్ని నేను నా స్పోర్ట్స్ బ్రా అని పిలుస్తాను, ”అని కశ్యప్ ట్వీట్‌కి క్యాప్షన్ ఇచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని జేమ్స్ బాండ్‌తో పోల్చిన టీఎంసీ ఎంపీ

దీనిమీద ట్విటర్ లో విచిత్రమైన కామెంట్స్ వచ్చాయి. చాలామంది ఫన్నీగా స్పందించారు. ఇది రచ్చ అయ్యేట్టుందనుకున్న మింత్రా కశ్యప్ ట్వీట్ కి రెస్పాండ్ అయ్యారు.  క్షమాపణ ట్వీట్ చేశారు. ఈ పొరపాటు ను సరిదిద్దడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మీకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి అంటూ myntra support క్షమాణలు తెలిపింది.

కానీ నెటిజన్లు ఊరుకుంటారా? కశ్యప్ కు క్షమాపణ ఓకే... అయితే బ్రా బదులు సాక్స్ అందుకున్న ఆ మహిళ పరిస్తితి ఏంటి? వాటిని ఆమె ఎలా ధరిస్తుంది. ఆమెకు కూడా క్షమాపణ చెప్పాలి.. అంటూ మండిపడ్తున్నారు. మరో యూజర్ ఫుట్ బాల్ సాక్సులకు బదులు బ్రా పంపారు ఓకే.. బట్ పంపేముందు quality check చేస్తారు కదా.. మీరేం క్వాలిటీ చెక్ చేశారో చెబుతారా? అంటూ కాస్త వ్యగ్యంగా పెట్టారు. 

కొంతమంది వినియోగదారులు ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ను కూడా స్లామ్ చేశారు ఇతర విషయాలతోపాటుగా ఎక్స్‌ఛేంజ్‌లను ఆర్డర్ చేయడంలో తమ ఇబ్బందులను పంచుకున్నారు.
 

click me!