రేపు బౌద్ధ సన్యాసుల కార్యక్రమానికి ప్రధాని మోడీ.. ఖుషీనగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం

By telugu teamFirst Published Oct 19, 2021, 6:53 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ ఖుషీనగర్‌లో రేపు అభిధమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్ సహా పలుదేశాల నుంచి బౌద్ధ సన్యాసులు విచ్చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు నేతలు ఇందులో పాల్గొనబోతున్నారు. రేపే ఖుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించబోతున్నారు.
 

న్యూఢిల్లీ: రేపు Uttar Pradeshలోని Khushinagarలో అభిధమ్మ కార్యక్రమం జరగనుంది. కేంద్ర సాంస్కృతిక శాఖ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందులో దేశవిదేశాల నుంచి దౌత్య అధికారులు, బౌద్ధ భిక్షవులు విచ్చేయనున్నారు. శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, దక్షిణ కొరియా, నేపాల్, భూటాన్, కంబోడియాల నుంచి బౌద్ధ సన్యాసులు వస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యానాథ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిశన్ రెడ్డి, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయ మంత్రులూ హాజరుకానున్నారు.

గౌతమ బుద్ధుడు మరణించిన తర్వాత మహా పరినిర్వాణం పొందిన ప్రాంతంగా ఖుషీనగర్‌కు విశిష్టత ఉన్నది. Buddha తీర్థయాత్రకు ఇది ప్రసిద్ధి. ప్రపంచవ్యాప్త బౌద్ధ సన్యాసులు ఖుషీనగర్‌కు పర్యటిస్తుంటారు. శ్రీలంక నుంచి 123 మంది ప్రతినిధుల బృందం బౌద్ధ బిక్షులు సహా రేపు ఖుషీనగర్‌కు చేరబోతున్నారు. వీరు తెస్తున్న గౌతమ బుద్ధుడికి చెందిన వస్తువులను భారత ప్రభుత్వం స్వీకరించనుంది. అంతేకాదు, ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బౌద్ధ భిక్షవులకు వస్త్రాలను దానం చేయనున్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. గుజరాత్‌లోని వడనగర్‌ తవ్వకాల్లో లభించిన గౌతమ బుద్ధుడికి సంబంధించిన పురాతన వస్తువులనూ ఇక్కడ ప్రదర్శనకు ఉంచనున్నారు.

Also Read: కేదార్‌నాథ్ పర్యటించనున్న ప్రధానమంత్రి మోడీ.. ‘శంకరాచార్యుడి సమాధి పునర్నిర్మాణం’

బౌద్ధులు అతిముఖ్యమైన స్థలమైన ఖుషీనగర్‌కు విదేశాల నుంచి ప్రయాణసదుపాయాలు కల్పించే భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది. రేపు అభిధమ్మ కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ  అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఖుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా విదేశాల నుంచి ఖుషీనగర్‌కు బౌద్ధ భిక్షువులు సులువగా చేరుకోగలుగుతారు.

click me!