కూతురిని ప్రేమిస్తున్నాడని.. ఓ తండ్రి ఘాతుకం: యువకుడి తాత, తండ్రి సహా నలుగురి హత్య

Siva Kodati |  
Published : Jul 04, 2021, 07:41 PM IST
కూతురిని ప్రేమిస్తున్నాడని.. ఓ తండ్రి ఘాతుకం: యువకుడి తాత, తండ్రి సహా నలుగురి హత్య

సారాంశం

తన కుమార్తెను ప్రేమిస్తున్నాడన్న కక్షతో యువకుడి కుటుంబంలోని నలుగురిని దారుణంగా హత్య చేశాడు యువతి తండ్రి. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. 

తన కుమార్తెను ప్రేమిస్తున్నాడన్న కక్షతో యువకుడి కుటుంబంలోని నలుగురిని దారుణంగా హత్య చేశాడు యువతి తండ్రి. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బాట్లాలోని బలార్వాల్ గ్రామానికి చెందిన సుఖ్జీందర్ సింగ్ కుమార్తె అదే గ్రామానికి చెందిన జెర్మన్‌జీత్ సింగ్‌ అనే యువకుడిని ప్రేమిస్తోంది. విషయం తెలిసిన సుఖ్జీందర్ ఆగ్రహంతో ఆదివారం ఉదయం జెర్మన్‌జీత్ సింగ్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ జెర్మన్ జీత్‌తోపాటు అతడి తండ్రి సుఖ్విందర్ సింగ్ ఉన్నారు. 

తన కుమార్తెతో ప్రేమ విషయాన్ని వారి వద్ద ప్రస్తావించిన సుఖ్జీందర్ సింగ్ ఆపై పూనకవం వచ్చినవాడిలా ఊగిపోయాడు. వాగ్వివాదం మరింత పెద్దది కావడంతో సుఖ్జీందర్ తన వెంట తెచ్చుకున్న తుపాకితో వారిపై కాల్పులు జరిపాడు. ఈ  కాల్పుల్లో యువకుడి తండ్రి సుఖ్విందర్ అక్కడికక్కడే మరణించగా... జెర్మన్‌జీత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల శబ్ధం విన్న జెర్మన్‌జీత్ తాత మంగళ్ సింగ్, మామయ్య జస్బీర్ సింగ్, కజిన్ బబన్‌దీప్, బంధువు జాషన్ అక్కడికి చేరుకుని సుఖ్జీందర్ సింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Also Read:పరువు హత్య : ప్రేమజంటను కట్టేసి, హింసించి, చాకుతో పొడిచి చంపిన యువతి తండ్రి... !

అయితే నిందితుడు సుఖ్జీందర్ సింగ్ వారిపైనా కాల్పులు జరపడంతో మంగళ్ సింగ్, జస్బీర్ సింగ్, బబన్‌దీప్‌లు మరణించారు. తీవ్రంగా గాయపడిన జెర్మన్‌జీత్ సింగ్, జాషన్‌లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుడు సుఖ్జీందర్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతనిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu