మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆన్‌లైన్ సర్వే.. ప్రజలకు 4 ప్రశ్నలు

By Siva KodatiFirst Published Jul 4, 2021, 3:54 PM IST
Highlights

ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై జేపీసీ దర్యాప్తునకు మోదీ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలని ఆయన ఆదివారం ప్రజల నుంచి అభిప్రాయసేకరణకు ఆయన శ్రీకారం చుట్టారు.

ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై జేపీసీ దర్యాప్తునకు మోదీ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలని ఆయన ఆదివారం ప్రజల నుంచి అభిప్రాయసేకరణకు ఆయన శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ సర్వేను ప్రారంభించారు. ఈ ఒప్పందంపై ఫ్రాన్స్‌లో న్యాయ విచారణ జరుగుతుండటంతో మన దేశంలో కూడా సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చేత దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ శనివారం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. 

ఇక ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రశ్న క్రింద రాహుల్ నాలుగు జవాబులను ఇచ్చారు. వీటిలో ఏదో ఒకదానిని ఎంపిక చేయడం ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు. 1. అపరాధ భావం, 2. మిత్రులను కాపాడటం, 3. జేపీసీకి రాజ్యసభ సీటు అవసరం లేదు, 4. పైవన్నీ సరైనవే. ఈ నాలుగింటిలో ఏదో ఒకదానిని ఎంపిక చేయడం ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పవచ్చని రాహుల్ కోరారు.

Also Read:రాహుల్ గాంధీ మీ సమస్యేంటి..? మండిపడ్డ కేంద్ర మంత్రి

ఈ సర్వేను రాహుల్ గాంధీ ట్విటర్‌ వేదికగా నిర్వహిస్తున్నారు. రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్, రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా దీనిపై ప్రచారం చేసినప్పటికీ, కాంగ్రెస్‌కు పెద్దగా లాభం కలగలేదు.  కాగా, 36 యుద్ధ విమానాల కోసం 2016లో భారత ప్రభుత్వం, ఫ్రెంచ్ విమానాల తయారీదారు డసాల్ట్ ఏవియేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. యూపీఏ ప్రభుత్వంలో చర్చించిన ధర కన్నా ఎక్కువ ధరకు ఈ యుద్ధ విమానాలను కొనడానికి మోడీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

click me!