విమానంలో దుస్తులు విప్పేసి.. సిబ్బందిని అసభ్యంగా తాకుతూ

Published : Apr 09, 2021, 07:19 AM IST
విమానంలో దుస్తులు విప్పేసి.. సిబ్బందిని అసభ్యంగా తాకుతూ

సారాంశం

 మహిళా సిబ్బందిని అసభ్యంగా తాకుతూ తన దుస్తులు మొత్తం విప్పేశాడు. అతని ఆకస్మిక ప్రవర్తను ప్రయాణికులంతా కంగుతిన్నారు.

విమానంలో ఓ ప్రయాణికుడు బీభత్సం సృష్టించాడు. మద్యం సేవించి విమానం ఎక్కడమే కాకుండా..  ఆ మత్తులో నానా రభస చేశాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానంలో ఓ ప్రయాణికుడు తన శరీరంపై ఉన్న దుస్తులను విప్పేశాడు. అంతేకాకుండా విమాన సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించాడు. తొలుత సదరు ప్రయాణికుడు లైఫ్ జాకెట్ల విషయంలో విమాన సిబ్బందితో గొడవకు దిగాడు.

అనంతరం మహిళా సిబ్బందిని అసభ్యంగా తాకుతూ తన దుస్తులు మొత్తం విప్పేశాడు. అతని ఆకస్మిక ప్రవర్తను ప్రయాణికులంతా కంగుతిన్నారు. ఈ ఘటనపై ఎయిర్ ఏషియా ఇండియా ఎయిర్ లైన్స్ సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ... తాగిన మత్తులో ఉన్న ప్రయాణికుడు తమ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడని చెప్పారు.

తోటి ప్రయాణికులు నచ్చచెప్పిన తర్వాత సదరు ప్రయాణికుడు శాంతించి కూర్చున్నాడని వారు పేర్కొన్నారు. ఆ తర్వాత దీని గురించి పైలెట్లకు సమాచారం ఇచ్చారని వివరించారు. దీంతో పైలెట్ జరిగిన సంఘటనపై ఢిల్లీలో ఏటీసీకి సమాచారం అందించి.. అత్యవసర ల్యాండింగ్ కి పర్మిషన్ తీసుకున్నారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ కాగానే... అతనిని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించినట్లు ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!
Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే