ఏడేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం..!

Published : Jul 10, 2021, 07:43 AM ISTUpdated : Jul 10, 2021, 07:46 AM IST
ఏడేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం..!

సారాంశం

బాలిక తల్లిదండ్రులు పని చేసేందుకు బయటకు వెళ్లగా, పక్కింటి వ్యక్తి అయిన సర్బ్‌జిత్‌ సింగ్‌ బాలికను దగ్గర్లోని పొలానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అభం, శుభం తెలియని ఓ మైనర్ బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. తల్లిదండ్రులు లేని సమయంలో.. మైనర్ బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పంజాబ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గురువారం బాలిక తల్లిదండ్రులు పని చేసేందుకు బయటకు వెళ్లగా, పక్కింటి వ్యక్తి అయిన సర్బ్‌జిత్‌ సింగ్‌ బాలికను దగ్గర్లోని పొలానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టాడు. తల్లిదండ్రులు వచ్చాక విషయం తెలుసుకొని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్