భర్తతో విడిపోయి.. మాట వినలేదని కూతుర్ని క్యాండిల్ తో కాల్చి... ఓ కన్నతల్లి ఘాతుకం.. !

Published : Jul 09, 2021, 05:00 PM ISTUpdated : Jul 09, 2021, 05:01 PM IST
భర్తతో విడిపోయి.. మాట వినలేదని కూతుర్ని క్యాండిల్ తో కాల్చి... ఓ కన్నతల్లి ఘాతుకం.. !

సారాంశం

పక్కింట్లో ఆడుకుంటున్న కూతుర్ని తీసుకెళ్లి.. మొదట కర్రతో కొట్టింది. తరువాత క్యాండిల్ తో కాల్చింది. సోమవారం బాలిక ఆడుకుంటుండగా కిందపడి కాలిన చోటే మళ్లీ గాయమయ్యింది. దీంతో తల్లి వెంటనే కూతుర్ని ఆస్పత్రికి తీసుకెళ్లింది. 

బెంగళూరు : ఆడుకోవడానికి పక్కింటికి వెళ్లొద్దని ఎంత చెప్పినా వినట్లేదని కూతుర్ని కొట్టి, కుడిచేతిని కాల్చిందో తల్లి. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి బయటికి వెళ్లడం గమనించిన తొమ్మిదేళ్ల కూతురు ఆడుకోవడానికి పక్కింటికి వెళ్లింది. కొద్ది సేపటికే తిరిగి వచ్చిన తల్లికి ఇంట్లో కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికింది. 

పక్కింట్లో ఆడుకుంటున్న కూతుర్ని తీసుకెళ్లి.. మొదట కర్రతో కొట్టింది. తరువాత క్యాండిల్ తో కాల్చింది. సోమవారం బాలిక ఆడుకుంటుండగా కిందపడి కాలిన చోటే మళ్లీ గాయమయ్యింది. దీంతో తల్లి వెంటనే కూతుర్ని ఆస్పత్రికి తీసుకెళ్లింది. 

కాలిన గాయాలను గమనించిన డాక్టర్ పోలీసులకు సమాచారమివ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భార్యభర్తలిద్దరూ విడిపోయారు. చిన్న కూతురు తల్లితో, పెద్ద కూతురు తండ్రితో వేర్వేరుగా ఉంటున్నారు. పొరుగింటి వాళ్లు సూటిపోటి మాటలనడంతో చిరాకులో ఉన్న ఆమె కూతుర్ని కొట్టి, చెయ్యి కాల్చింది. 

PREV
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu